న్యూఢిల్లీ: తాము చర్చల మధ్యలో ఉండగా ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ.. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌కు చేసిన ఫోన్ కాల్ చేసి మొత్తం చెడగొట్టారని ఇరాన్ ఆరోపిస్తోంది. ఇరాన్-అమెరికా ప్రతిష్టంభనలో ఒక కీలక పురోగతికి దారితీయగల చర్చలను పట్టాలు తప్పించింది మాత్రం కచ్చితంగా నెతన్యాహూ ఫోన్ కాలేనని అంటోంది.
అమెరికా- ఇరాన్ చర్చలు విఫలం చెందిన అనంతరం పాక్ నుంచి వెనుదిరిగిన కొన్ని గంటల తర్వాత, ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాఘ్చి తన సోషల్ మీడియా అకౌంట్ ‘ఎక్స్’ ద్వారా పలు ఆరోపణలు చేశారు. మేం చర్చల్లో బిజీగా ఉన్నాం, మా చర్చలు కీలక దశకు రాబోతున్న తరుణంలో నెతన్యాహూ నుండి వాన్స్‌కు ఫోన్ కాల్ వచ్చింది.
ఆ తర్వాత అంతా గందరగోళమైంది. అప్పటిదాకా సజావుగా సాగిన చర్చలు ఆ ఒక్క ఫోన్ కాల్ తర్వాత మొత్తం మారిపోయింది. అప్పటివరకూ అమెరికా-ఇరాన్‌ల మధ్య సాగిన చర్చలు మొత్తం ఇజ్రాయెల్‌కు లబ్ధి చేకూర్చాలనే దిశగా వెళ్లిపోయాయి. ఆ ఫోన్ కాల్‌తో అమెరికా-ఇరాన్‌ల దృష్టి మళ్లింది’ అంటూ అరాఘ్చీ పేర్కొన్నారు. తాము ఎంతో నమ్మకంతో పాకిస్తాన్‌కు చర్చలకు వచ్చామని, కానీ ఎటువంటి పురోగతి కనబడలేదన్నారు.
ఇదీ చదవండి:


