గాజాలో అన్నార్తులపైకి కాల్పులు 31 మంది మృతి | Israeli forces open fire on Palestinians at aid distribution center | Sakshi
Sakshi News home page

గాజాలో అన్నార్తులపైకి కాల్పులు 31 మంది మృతి

Jun 2 2025 1:16 AM | Updated on Jun 2 2025 1:16 AM

కాల్పుల నుంచి తప్పించుకునేందుకు జనం పరుగులు

170 మందికి పైగా గాయాలు 

ఇజ్రాయెల్‌పై విమర్శల వెల్లువ

రఫా (గాజా స్ట్రిప్‌): గాజాలో మాటలకందని ఘోరం చోటుచేసుకుంది. అన్నార్తులపై ఇజ్రాయెల్‌ సైన్యం ఆదివారం విచక్షణారహితంగా కాల్పులకు తెగబడింది. ఐరాస సాయాన్ని కాదని అమెరికా దన్నుతో గాజా లో ఇజ్రాయెల్‌ స్వయంగా సహాయ కేంద్రాలను మొదలుపెట్టడం తెలిసిందే. వాటినుంచి ఆహారం తెచ్చుకోవడానికి వెళ్తున్న వారిపై తూటాల వర్షం కురిపించింది. 

ఆ కాల్పుల్లో 31 మంది పాలస్తీనావాసులు బలయ్యారు. కనీసం 170 మందికి పైగానే గాయపడ్డట్టు హమాస్‌ వర్గాలు వివరించాయి. సహాయ కేంద్రానికి కిలోమీటర్‌ దూరంలో ఈ దారుణం జరిగినట్టు గాజా ఆరోగ్య శాఖ సిబ్బందితో పాటు ప్రత్యక్ష సాక్షులు కూడా తెలిపారు. దీనిపై అంతర్జాతీయంగా దుమారం రేగుతుండటంతో ఇజ్రాయెల్‌ తీవ్ర ఇరకాటంలో పడింది. అలాంటి ఉదంతమేదీ ఇప్పటిదాకా తమ దృష్టికి రాలేదని నెతన్యాహు ప్రభుత్వం చెప్పుకొచ్చింది. దీనిపై దర్యాప్తు             చేపట్టినట్టు పేర్కొంది.  

 

Advertisement
 
Advertisement
Advertisement