ప్రపంచ దేశాల్లో యోగా దినోత్సవం | Indian embassy in New York celebrates International Yoga day | Sakshi
Sakshi News home page

ప్రపంచ దేశాల్లో యోగా దినోత్సవం

Published Sat, Jun 22 2024 4:44 AM | Last Updated on Sat, Jun 22 2024 4:44 AM

Indian embassy in New York celebrates International Yoga day

న్యూఢిల్లీ/న్యూయార్క్‌/టెల్‌అవీవ్‌: అంతర్జాతీయ యోగ దినోత్సవంలో ప్రపంచవ్యాప్తంగా ఔత్సాహికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అమెరికా రాజధాని వాషింగ్టన్‌ డీసీతోపాటు న్యూయార్క్‌లో పలు కార్యక్రమాలు జరిగాయి. న్యూయార్క్‌లోని ప్రఖ్యాత టైమ్స్‌ స్క్వేర్‌లో ప్రత్యేక యోగా కార్యక్రమాలు జరిగాయి. అత్యధిక ఉష్ణోగ్రతలను లెక్క చేయకుండా జనం వేలాదిగా పాల్గొన్నారు. అదేవిధంగా ఇజ్రాయెల్‌లోని టెల్‌అవీవ్‌లో జరిగిన కార్యక్రమంలో 300 మంది పాల్గొన్నారు. 

సింగపూర్‌లో ఆరోగ్య శాఖ మంత్రి రహయు మహజం ఆధర్యంలో జరిగిన కార్యక్రమంలో 200 మంది ఔత్సాహికులు పాల్గొన్నారు. నేపాల్‌లోని పొఖారా, బుద్ధుడి జన్మస్థలం లుంబినిలో యోగా దినోత్సవం ఘనంగా జరుపుకున్నారు. శ్రీలంక రాజధాని కొలంబో, చైనా రాజధాని బీజింగ్, ఫ్రాన్సు రాజధాని పారిస్, మాల్దీవులు రాజధాని మాలె, ఇటలీ రాజధాని రోమ్, సౌదీ రాజధాని రియాద్, కువైట్, మలేసియా, ఇండోనేసియాలో, స్వీడన్‌ రాజధాని స్టాక్‌హోం, లండన్‌లోని ట్రఫాల్గర్‌ స్క్వేర్‌లోనూ యోగా కార్యక్రమాలు జరిగాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement