అయోధ్య రామమందిరం ఉత్సవంలో భారత ప్రధాని మోదీ పాల్గొనడంపై పాకిస‍్థాన్ చేసిన వ్యాఖ్యలను భారత్ తీవ్రంగా ఖండించింది. భారత్‌లో మైనారిటీలకు ముప్పు ఉందని పాకిస్థాన్ చేసిన వ్యాఖ్యలు ఎట్టి పరిస్థిత్లులో ఆమోదయోగ్యం కాదని తెలిపింది. ఆ దేశానికి భారత అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకునే స్థాయి లేదని విమర్శించింది.
నిన్న అయోధ్యలో జరిగిన రామమంధిర ధ్వజారోహాణ కార్యక్రమంలో మోదీ పాల్గొనడంపై పాక్ చేసిన వ్యాఖ్యలకు భారత విదేశాంగ శాఖ ఘాటుగా స్పందించింది. పాకిస్థాన్ వ్యాఖ్యలు మతాల మధ్య చిచ్చుపెట్టేలా ఉన్నాయని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణదీర్ జైశ్వాల్ అన్నారు. దాయాది దేశానికి భారత అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోవడం అలవాటుగా మారిందన్నారు.
జైశ్వాల్ మాట్లాడుతూ "మేము అభ్యంతకర వ్యాఖ్యలను విన్నాము మతతత్వం, అణిచివేత, మైనారిటీలపట్ల దాడులు అనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ దేశం ఇతరులకు నీతులు చెప్పే స్థితిలో లేదు. అవతలి వారికి కపట నీతులు చెప్పే బదులు అక్కడ మానవ హక్కుల ఉల్లంఘన జరగకుండా చూస్తే మంచిది" అని జైశ్వాల్ ఘాటుగా బదులిచ్చారు.
అసలేం జరిగింది
నిన్న అయోధ్య రామాలయ ధ్వజారోహణ కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. అయితే ఈ ఉత్సవంపై పాకిస్థాన్ విదేశాంగ అభ్యంతరం తెలుపుతూ లేఖ విడుదల చేసింది. భారత్ లో మతపరమైన మైనార్టీలకు రక్షణ లేదని ముస్లింల మతపరమై కట్టడాలకు హిందు అతివాదులతో ముంపు పొంచి ఉందని ప్రకటన విడుదల చేసింది. అయితే ఈ ప్రకటనకు భారత్ ఘాటుగా బదులిచ్చింది.


