బాలల సంరక్షణకు భారత్‌ చర్యలు భేష్‌

India removed from UNSG report on impact of armed conflict on children - Sakshi

ఐక్యరాజ్య సమితి: అంతర్జాతీయంగా భారత్‌కు మరో శుభపరిణామమిది. చిన్న పిల్లలు సాయుధ పోరాటాల వైపు వెళ్లకుండా కట్టడి చేసినందుకు గాను ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్‌ (యూఎన్‌ఎస్‌జీ) వార్షిక నివేదిక నుంచి భారత్‌ పేరును తొలగించినట్టుగా యూఎన్‌ సెకట్రరీ జనరల్‌ ఆంటోనియా గుటెరెస్‌ తెలిపారు. సాయుధ ఘర్షణల ప్రభావం పడకుండా చిన్నారుల మెరుగైన సంరక్షణ కోసం భారత్‌ తీసుకున్న చర్యల్ని గుటెరెస్‌ స్వాగతించారు. 2010 నుంచి భారత్‌ పేరు ఈ నివేదికలో ఉంటూ వస్తోంది.

కశ్మీర్‌లో ఉగ్రసంస్థలు బాలలను నియమించడం, భద్రత పేరుతో సైనికులు తిరిగి అదుపులోకి తీసుకోవడం వంటివాటితో భారత్‌ పేరు ఆ నివేదికలో ఉంటూ వస్తోంది. భారత్‌తో పాటు బుర్కినా ఫాసో, కేమరూన్, నైజీరియా, పాకిస్తాన్, ఫిలిఫ్పీన్స్‌లోనూ చిన్నారులు ఉగ్రముఠాల్లో చేరుతున్నట్టు యూఎన్‌ నివేదికలు చెబుతున్నాయి. బాలల హక్కుల పరిరక్షణకు కశ్మీర్‌లో ఒక కమిషన్‌ను ఏర్పాటు చేయడంపై గుటెరెస్‌ హర్షం వ్యక్తం చేశారు. బాలల సంక్షేమం కోసం చేపట్టిన చర్యలతో ఛత్తీస్‌గఢ్, అసోం, జార్ఖండ్, ఒడిశా, జమ్ముకశ్మీర్‌లలో బాలల సంరక్షణ మెరుగైందని ఆ నివేదిక వెల్లడించింది.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top