వైట్‌హౌస్‌లో భారీ రక్తపాతానికి కుట్ర | Group planned to attack White House UFC event using snipers and drones, FBI says | Sakshi
Sakshi News home page

వైట్‌హౌస్‌లో భారీ రక్తపాతానికి కుట్ర

Jun 17 2026 4:14 AM | Updated on Jun 17 2026 4:24 AM

Group planned to attack White House UFC event using snipers and drones, FBI says

అమెరికా వైట్‌హౌస్‌లో నిర్వహించిన UFC ఫ్రీడమ్ 250 ఈవెంట్‌పై భారీ దాడికి కుట్ర పన్నిన ఐదుగురిని ఎఫ్‌బీఐ అరెస్ట్ చేసింది. ప్రభుత్వ ఉన్నతాధికారులు, ప్రముఖులను హత్య చేయడమే లక్ష్యంగా వీరు ప్రణాళిక రూపొందించినట్లు అమెరికా న్యాయశాఖ వెల్లడించింది.

అమెరికాలోని ఓహాయో, మిస్సోరీ, నెబ్రాస్కా, కాలిఫోర్నియా రాష్ట్రాల్లో వారాంతంలో నిర్వహించిన ప్రత్యేక ఆపరేషన్‌లో నిందితులను అదుపులోకి తీసుకున్నారు. కుట్రపై దర్యాప్తు ఇంకా కొనసాగుతోందని అధికారులు తెలిపారు.

నిందితులు డ్రోన్లకు పేలుడు పదార్థాలు అమర్చి వైట్‌హౌస్ ప్రాంగణంలో జరిగిన UFC కార్యక్రమంపై దాడి చేయాలని ప్రణాళిక రచించినట్లు కోర్టు పత్రాల్లో పేర్కొన్నారు. డ్రోన్ల పేలుళ్లతో కార్యక్రమంలో గందరగోళం సృష్టించి, ప్రజలు బయటకు పరుగులు తీస్తున్న సమయంలో స్నైపర్లతో "హై వాల్యూ టార్గెట్లను" కాల్చి చంపాలనుకున్నట్లు దర్యాప్తులో తేలింది.

ఈ కేసులో టైసెన్ సి. ప్రాపర్ (19), బ్రయాన్ ఒమర్ రో (24), మైఖేల్ అలాన్ థామస్ (32), డేనియల్ కె. ఎస్క్రిడ్జ్ (32), అబ్రహం హెర్మోసిల్లో అల్వారెజ్ (31)లను అభియోగాలు మోపారు.

దర్యాప్తులో భాగంగా ఓహాయోకు చెందిన టైసెన్ ప్రాపర్ ఇంట్లో భారీగా ఆయుధాలు, వేలాది రౌండ్ల బుల్లెట్లు, వ్యూహాత్మక సైనిక సామగ్రిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పలువురు కాంగ్రెస్ సభ్యులను లక్ష్యాలుగా గుర్తించినట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement