
ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ఎమాన్యుయెల్ మాక్రోన్ ఇటీవల న్యూయార్క్‌లో జరిగిన 80వ యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ (UNGA) సమావేశానికి హాజరయ్యారు. ఆయన ఫ్రెంచ్ ఎంబసీకి వెళ్తున్న సమయంలో, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కాన్వాయ్ రోడ్డులో ప్రయాణిస్తున్నందున, న్యూయార్క్ పోలీస్ మాక్రోన్ వాహనాన్ని తాత్కాలికంగా ఆపేశారు. ఈ ఘటనలో మాక్రోన్ తన కారులో నుంచి బయటకు వచ్చి, ట్రంప్‌కు ఫోన్ చేశారు.
‘ట్రంప్.. ఏమైందో గెస్ చేయండి.. నన్ను రోడ్డుపైనే మీ పోలీసులు ఆపేశారు. మీ కాన్వాయ్ వస్తున్నందున నన్ను ఇక్కడే నిలిపేశారు’ అంటూ సరదాగా ట్రంప్‌తో వ్యాఖ్యానించారు. అనంతరం మాక్రోన్ నడుచుకుంటూ సమావేశానికి హాజరయ్యారు. కేవలం పాదచారుల కోసం మాత్రమే రోడ్డును తెరవడంతో అది మాక్రోన్‌కు కూడా తప్పలేదు. మాక్రోన్ ఫోన్‌లో మాట్లాడుకుంటూ ప్రజలతో పోటోలు తీసుకుంటూ యూఎన్‌జీఏ ఎంబాసీకి వెళ్లారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.
Macro vs Trump Funny Fight 😂🚨
Macron was stopped by the New York Police, because of Donald Trump.
Macron called Trump and said -
"I'm waiting outside right now because everything is blocked for you (motorcade)"
He had to walk to the French Embassy, for 80th UNGA.
Video 📷 pic.twitter.com/UHFR7ivsCg— Mayank (@mayankcdp) September 23, 2025