అమెరికాలో కొత్త రకం వైరస్ కలకలం రేపుతోంది. వాషింగ్టన్ కు చెందిన ఓవ్యక్తికి బర్డ్ ప్లూ సోకడంతో ఆసుపత్రిలో చేరారు. దీంతో ఆ వ్యక్తికి పరీక్షలు నిర్వహించిన వైద్యులు అతనికి " హెచ్5 ఎన్5 ఏవియన్ ఇన్‌ప్లూయింజా" అనే కొత్తరకం వైరస్ సోకినట్లు గుర్తించారు. ఇటువంటి వైరస్ మానవులలో సోకడం ఇది మెుదటిసారని డాక్టర్లు తెలిపారు.
వాషింగ్టన్ లోని ఓ వ్యక్తికి "ఎచ్5ఎన్5 ఏవియన్ ఇన్‌ప్లూయింజా" వైరస్ సోకడం ప్రస్తుతం అమెరికాలో కలకలం రేపుతోంది. సాధారణంగా ఈ వైరస్ మనుషులకు అంటుకోదని కానీ ఈ వ్యక్తికి ఎలా సోకిందనే విషయాలను అధ్యయనం చేస్తున్నామని డాక్టర్లు తెలిపారు. బాధితుడు బహుశా కోళ్ల ద్వారనే వైరస్ వ్యాపించి ఉండవచ్చని భావిస్తున్నారు.అయితే ఈ వైరస్ సోకిన వ్యక్తి వృద్ధుడని అతనికి ఇతర ఆరోగ్యసమస్యలున్నాయని డాక్టర్లు తెలిపారు.
సాధారణంగా ఇన్‌ప్లూయింజా వైరస్ జంతువులలోనే వ్యాపిస్తుందని ఈ వైరస్ సోకిన జంతువుల లాలాజలం, మలపదార్థాలు, పాడి పశువుల పాల ద్వార వేరే ప్రాణులకు సోకే అవకాశం ఉందని తెలిపారు. ఇది ఒకప్రాణి నుంచి మరోప్రాణికి సోకే అవకాశం శీతాకాలంలో మరింత అధికంగా ఉంటుందన్నారు. ప్రస్తుతం వైరస్ సోకిన వ్యక్తితో సన్నిహితంగా ఉన్న వ్యక్తుల వివరాలు సేకరిస్తున్నామని వారికి కూడా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తామని డాక్టర్లు పేర్కొన్నారు.
అమెరికాలో బర్డ్ ప్లూ వైరస్ కేసు రావడం గడిచిన తొమ్మిది నెలల్లో ఇదే తొలిసారని అక్కడి వైద్యశాఖ ప్రకటించింది. ఈ వైరస్ మనుషులలలో అంత ప్రభావం చూపే అవకాశాలు లేవని అయితే అలా అని దానిని తేలికగా తీసుకోకూడదని డాక్టర్లు తెలిపారు. బర్డ్ ప్లూ కేసులు నమోదైన నేపథ్యంలో ప్రజలంతా జాగ్రత్త పాటించాలని ఆరోగ్యశాఖ తెలిపింది. కోళ్ల పరిశ్రమలలో విధులు నిర్వహించే కార్మికులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.


