రష్యాలోని ఓ ఫ్యాక్టరీ కార్మికుడిగా పనిచేస్తున్న వాద్లిమిర్ రైచగొవ్ శాలరీ అకౌంట్లో సడన్‌గా రూ.77 లక్షలు అదనంగా వచ్చిపడ్డాయి. మరో 34 మందికి ఇవ్వాల్సిన వేతనం సాఫ్ట్‌వేర్ తప్పిదం వల్ల రైచగొవ్ ఖాతాలకి వెళ్లిపోయినట్టు గుర్తించిన అకౌంట్స్ డిపార్ట్ మెంట్ వెంటనే అతడికి కాల్ చేసి డబ్బులు వెనక్కి వేయమని కోరింది. అయితే, అనుకోకుండా దక్కిన లక్ష్మీ కటాక్షాన్ని వదులుకోవడానికి ఇష్టంలేని రైచగొవ్.. బిల్లింగ్ లోపం అయితే వెనక్కి ఇవ్వడం తన బాధ్యత అని, కానీ అది సాంకేతిక లోపం కాబట్టి ఇవ్వడం, ఇవ్వకపోవడం తన ఇష్టమని వాదించాడు. తన కంపెనీ పేరుతో శాలరీ అని జమ అయినందున అది తనదేనన్నాడు. దీంతో కంపెనీ అతడిపై కేసు వేయగా.. కోర్టు కంపెనీకి అనుకూలంగా తీర్పు వెలువరించింది. రైచగొవ్ వెనక్కి తగ్గకుండా అప్పీల్ దాఖలు చేశాడు. అక్కడా చుక్కెదురు కావడంతో ఏకంగా సుప్రీంకోర్టుకు వెళ్లాడు. ప్రస్తుతం ఆ కేసు కోర్టు పరిశీలనలో ఉంది.


