తీవ్ర విషాదంలో డొనాల్డ్‌ ట్రంప్‌

Donald Trump Youngdr Brother Robert Trump Passed Away - Sakshi

న్యూయార్క్‌ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తమ్ముడు రాబర్ట్‌ ట్రంప్ శనివారం న్యూయార్క్‌లో తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని ట్రంప్‌ స్వయంగా వెల్లడించారు. 72 ఏండ్ల రాబర్ట్‌ ట్రంప్‌ అనారోగ్యంతో బాధపడుతూ మన్హటన్‌లోని న్యూయార్క్-ప్రెస్బిటేరియన్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన ట్రంప్ సంస్థ కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడిగా పని చేస్తున్నారు. 2016లో రాబర్ట్ ట్రంప్ తన సోదరుడితో పాటు రిపబ్లికన్‌ పార్టీకి మద్దతుగా మిల్‌బ్రూక్‌లో అనేక కార్యక్రమాలు నిర్వహించి నిధులు సైతం సేకరించారు.

శుక్రవారం రాత్రి న్యూజెర్సీకి వెళ్ళిన ట్రంప్‌ తన సోదరుడిని పరామర్శించేందుకు న్యూయార్క్ వెళ్లాలని చివరి నిమిషంలో నిర్ణయం తీసుకున్నారు. ఈలోగా తమ్ముడు ఆకస్మిక మృతి ట్రంప్‌ను బాగా కలచివేసింది.1948లో జన్మించిన రాబర్ట్‌ ట్రంప్‌ అమెరికా అధ్యక్షుడి నలుగురి సోదరులలో ఒకరు.  రాబర్ట్‌ మృతికి బరువెక్కిన హృదయంతో ట్రంప్‌ సంతాపం తెలిపారు.  'నా అద్భుత సోదరుడు రాబర్ట్ శాంతియుతంగా ఈ రాత్రి కన్నుమూశాడు. అతను నా సోదరుడు మాత్రమే కాదు.. మంచి స్నేహితుడు. అతడి జ్ఞాపకాలు నా హృదయంలో శాశ్వతంగా ఉంటాయి. ఐ లవ్ యూ రాబర్ట్. ఇక మీదట విశ్రాంతి తీసుకో' అని అమెరికా అధ్యక్షుడు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.(టిక్‌టాక్‌.. అమెరికా ఆస్తులను అమ్ముకోండి)

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top