సరదాల వేళ... తలుపులతో జాగ్రత్త!  | Donald Trump humorous take on French President Emmanuel Macron marital bond | Sakshi
Sakshi News home page

సరదాల వేళ... తలుపులతో జాగ్రత్త! 

Jun 1 2025 5:41 AM | Updated on Jun 1 2025 5:41 AM

వాషింగ్టన్‌: ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్‌ మాక్రాన్‌ను ఆయన భార్య ముఖంపై చేతులు వేసి తోసేస్తున్న వీడియో ఇటీవల ప్రపంచవ్యాప్తంగా వైరల్‌ కావడం తెలిసిందే. దానిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కూడా తాజాగా స్పందించారు. శుక్రవారం మీడియా భేటీ సందర్భంగా విలేకరులు ఈ అంశాన్ని లేవనెత్తారు. ‘‘అది అధ్యక్ష దంపతుల నడుమ సరదా సన్నివేశం మాత్రమే. మాక్రాన్‌తో మాట్లాడాను.

 వారి మధ్య సమస్యేమీ లేదు. అంతా బానే ఉంది’’అని ట్రంప్‌ చెప్పుకొచ్చారు. ఓ దేశాధినేతగా వైవాహిక బంధానికి సంబంధించి మరో దేశాధ్యక్షునికి మీరిచ్చే సలహా ఏమిటని ప్రశ్నించగా, ‘‘సరదాల వేళ తలుపులు మూసున్నదీ, లేనిదీ ఒకటికి రెండుసార్లు సరిచూసుకోండి చాలు. అంతకంటే మరేమీ అక్కర్లేదు’’అంటూ బదులిచ్చి నవ్వులు పూయించారు.   
 

Advertisement
 
Advertisement
Advertisement