వాషింగ్టన్ : అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కెనడాపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.  అమెరికా 51వ రాష్ట్రంగా కెనడా అవతరించడం గొప్ప ఆలోచనని అన్నారు. కెనడాలో నెలకొన్న రాజకీయ అనిశ్చితి కారణంగా చాలా మంది కెనడియన్లు ఈ ఆలోచనను స్వాగతిస్తున్నారని  ట్రూత్ సోషల్ మీడియా వేదికగా వ్యాఖ్యానించారు.  
పన్నులు, సైనిక రక్షణపై భారీ మొత్తంలో ఆదా అవుతుంది. అందుకే చాలా మంది కెనడియన్లు కెనడా 51వ రాష్ట్రంగా మారాలని కోరుకుంటున్నారు ’ అని ట్రంప్ ట్రూత్ సోషల్ వేదికగా పోస్ట్ చేశారు.
దీనికి తోడు కెనడా మార్కెట్ రిసెర్చ్, ఎన్నికల నిర్వహణ సంస్థ ఈ వారం లెగర్ పబ్లిక్ ఒపీనియన్ సర్వేలో 13 శాతం మంది కెనడియన్లు సైతం కెనడా దేశం అమెరికాలో కలిపితేనే బాగుంటుందన్న అభిప్రాయాలు వ్యక్తం చేశారు.
President Trump doubles down on making Canada the 51st state
Time to rid this country of the flea infested liberal swamp 🇨🇦🇨🇦 pic.twitter.com/naJEQqIcw1— wastedcanadian (@melissacare01) December 18, 2024
గతంలోనూ
ట్రంప్ కెనడా గురించి వ్యాఖ్యలు చేయడం ఇలా తొలిసారి గతంలోనూ వ్యాఖ్యానించారు. అయితే, తాజాగా కెనడా ఉప ప్రధాని క్రిస్టియా ఫ్రీలాండ్ రాజీనామా తర్వాత ట్రంప్ మరింత దూకుడుగా వ్యవహిస్తున్నట్లు తెలుస్తోంది.
కొద్ది రోజుల క్రితం అమెరికా పర్యటనలో భాగంగా కాబోయే అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో భేటీ అయ్యారు. ఆ భేటీలో ట్రూడో - ట్రంప్‌లు పలు అంశాలపై చర్చించారు.
అమెరికా మీడియా కథనాల ప్రకారం.. మెక్సికో, కెనడా, చైనాలపై అదనపు దిగుమతి సుంకాలు విధిస్తానన్న అంశం, అక్రమ వలసలు, మాదకద్రవ్యాల అక్రమ రవాణా అంశాలు ట్రంప్, ట్రూడో మధ్య ప్రస్తావనకు వచ్చాయి. పన్నులు పెరిగితే తమ దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావాలు తప్పవని ట్రంప్‌కు ట్రూడో స్పష్టంచేశారు. దీనిపై వెంటనే ట్రంప్ స్పందించారు.
‘‘ అమెరికా వాణిజ్య లోటు 100 బిలియన్ డాలర్లకు చేరువవుతోంది. ఇలాంటి కష్టకాలంలో మేం పన్నులు పెంచక తప్పదు. కెనడా నుంచి అమెరికాలోకి అక్రమ వలసలను అరికట్టండి. మాదకద్రవ్యాల అక్రమ రవాణాను అడ్డుకోండి. ప్రత్యేక దేశంగా ఉంటూ కూడా ఇవన్నీ చేయడం మీ వల్ల కాకపోతే అంతటి భారీ పన్నులను తప్పించుకోవడం కోసమైనా అమెరికాలో 51వ రాష్ట్రంగా చేరిపోండి’’ అని ట్రంప్ వ్యంగ్య వ్యాఖ్యలుచేశారు.
దీంతో ట్రూడో నిశ్చేష్టులయ్యారని వినికిడి. ట్రంప్‌తో వాగ్వాదానికి దిగలేక ట్రూడో ముఖంపై కృత్రిమ నవ్వును ఒలకబోశారని అక్కడి వారు చెప్పారు. ‘‘ కెనడా అమెరికాలోకి చేరాక రెండు రాష్ట్రాలుగా ముక్కలైతే బెటర్. ఒక ముక్కకు ట్రూడో గవర్నర్‌గా ఉండటం ఇంకా బెటర్. రెండు రాష్ట్రాల్లో ఒకటి లిబరల్ స్టేట్‌గా, మరోటి కన్జర్వేటివ్ స్టేట్‌గా ఉంటే బాగుంటుంది’’ అని ట్రంప్ ముక్తాయించాడు.

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
