సునీతా విలియమ్స్‌ను తీసుకురండి: ట్రంప్‌ | Donald Trump Asks Elon Musk To Bring Back Two Astronauts Stranded On Space Station, More Details Inside | Sakshi
Sakshi News home page

సునీతా విలియమ్స్‌ను తీసుకురండి: ట్రంప్‌

Jan 30 2025 5:21 AM | Updated on Jan 30 2025 11:13 AM

Donald Trump asks Musk to bring back two astronauts stranded on space station

ఎలాన్‌ మస్క్ ను కోరిన ట్రంప్‌ 

వ్యోమగాములను వదిలేశారని బైడెన్‌ సర్కారుపై ఆగ్రహం 

వాషింగ్టన్‌: నాసా వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్‌ విల్మోర్‌లను అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్‌) నుంచి తీసుకురావాలంటూ టెక్‌ దిగ్గజం ఎలాన్‌ మస్క్ ను అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ విజ్ఞప్తి చేశారు. ఈ విషయాన్ని ఆ యన తన సొంత సామాజిక మాధ్యమం ‘ట్రూత్‌ సోషల్‌’లో పంచుకున్నారు. ‘బైడెన్‌ ప్రభుత్వం అంతరిక్ష కేంద్రంలో వదిలేసిన ఇద్దరు ధైర్యవంతులైన వ్యోమగాములను తీసుకురావాలని మస్క్ ను కోరుతున్నా. 

సునీత, విల్మోర్‌ కొన్ని నెలలుగా అంతరిక్ష కేంద్రంలో ఎదురు చూస్తున్నారు. వీలైనంత త్వరగా వ్యోమగాములను తీసుకురావాలి. గుడ్‌ల క్‌ ఎలాన్‌’అని ట్రంప్‌ తన పోస్టులో పేర్కొన్నారు. దీనికి మస్క్‌ ఎక్స్‌ వేదికగా స్పందించారు. ‘‘మేం తీసుకొస్తాం. బైడెన్‌ ప్రభుత్వం ఇంతకాలం వారిన లా వదిలేయడం దారుణం’’అని మస్క్‌ వ్యాఖ్యానించారు. పది రోజుల మిషన్‌ కోసం సునీత, విల్మోర్‌ 2024 జూన్‌ 5న బోయింగ్‌ సంస్థకు చెందిన స్టార్‌లైనర్‌ వ్యోమనౌకలో అంతరిక్ష కేంద్రానికి వెళ్లారు. 

అయితే అక్కడికి వెళ్లాక వ్యోమనౌకలోని థ్రస్టర్‌ పనిచేయకపోవడం, హీలియం లీక్‌ కావడంతో వ్యోమగాములను అక్కడే వదిలేసి స్టార్‌లైనర్‌ క్యాప్సుల్‌ మాత్రం సెపె్టంబర్‌ 7న తిరిగి భూ మి మీదకొచి్చంది. అంతరిక్షంలో ఎక్కువకాలం ఉండటంతో ఆమె చాలా బరువు తగ్గినట్లు ఇటీవల బహిర్గతమైన ఫొటోల ద్వారా వెల్లడైంది. 

తన ఆరోగ్యంపై వస్తున్న ఊహాగానాలను గతేడాది నవంబర్‌లో సునీత తోసిపుచ్చారు. తన శరీరం కొద్దిగా మారిందని, అదే బరువుతో ఉన్నానని చెప్పారు. ఒకవేళ మార్చి నెలాఖరులో వీళ్లిద్దరూ భూమికి తిరిగొస్తే అనుకోకుండా అక్కడే ఉండిపోయి 300 రోజులపాటు అంతరిక్షంలో గడిపిన వ్యోమగాములుగా మరో రికార్డ్‌ నెలకొల్పుతారు. 

ఎలా నడవాలో గుర్తుంచుకునేందుకు ప్రయత్నిస్తున్నా: సునీత 
ఇప్పటికే 7 నెలలుగా అంతరిక్ష కేంద్రంలో ఉండిపోయిన సునీత తాను చదివిన పాఠశాల విద్యార్థులతో సోమవారం మాట్లాడారు. వర్చువల్‌గా జరిగిన ప్రశ్నోత్తరాల సెషన్‌లో సునీతను విద్యార్థులు అత్యల్ప గురుత్వాకర్షణ స్థితిపై ప్రశ్నలు సంధించారు. ‘‘ఈత కొట్టడం, ఎగరడం వంటి అనుభూతిని మాత్రమే ఆస్వాదిస్తున్నా. ఎక్కువకాలం అంతరిక్షంలో ఉండటం వల్ల తన శరీరం అనేక సర్దుబాట్లకు లోనైంది. 

చాలాకాలంగా నేను నడవలేదు. కూర్చోలేదు. పడుకోలేదు. నడవడం ఎలా ఉంటుందో గుర్తుంచుకోవడానికి ప్రయత్నిస్తున్నా’’అని తెలిపారు. ‘‘ఎలాగోలా తిరిగి రావడానికి మరో నెలరోజుల సమయం పడుతుందనుకున్నా. కానీ ఇన్ని రోజులైనా ఇంకా ఉండాల్సి రావడం కాస్త ఇబ్బందిపెడుతోంది. వృద్ధాప్యంలో ఉన్న నా తల్లితో వీలైనంతసేపు మాట్లాడుతున్నా. అంతరిక్ష కేంద్రంలో బిజీ షెడ్యూల్, కుటుంబంతో క్రమం తప్పకుండా మాట్లాడటం వల్ల తాను ఒంటరిగా ఉన్నట్లు భావించట్లేను’’అని సునీత చెప్పారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement