ఆర్థిక యుద్ధాలే.. అసలైన యుద్ధాలు | Dmitry Medvedev Warns France That Economic Real Wars | Sakshi
Sakshi News home page

ఆర్థిక యుద్ధాలే.. అసలైన యుద్ధాలు

Mar 2 2022 12:01 PM | Updated on Mar 3 2022 12:24 PM

Dmitry Medvedev Warns France That Economic Real Wars - Sakshi

మాస్కో: ఉక్రెయిన్‌పై రష్యా భీకర పోరు చేస్తూ ఉంటే, నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. రష్యాపై ఆర్థిక యుద్ధం మొదలైందన్న ఫ్రాన్స్‌ ఆర్థిక మంత్రి బ్రూనో లే మేరి ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. రష్యా ఆర్థిక వ్యవస్థని కుప్పకూలుస్తామన్నారు.

దీనిపై రష్యా మాజీ అధ్యక్షుడు, రష్యా భద్రతా మండలి డిప్యూటీ చైర్మన్‌ దిమిత్రి మెద్వెదెవ్‌ తీవ్రంగా ప్రతిస్పందించారు. ‘‘రష్యాపై ఆర్థిక యుద్ధమని అంటున్నవారు కాస్త నోరు అదుపులో ఉంచుకోవాలి. ఆర్థిక యుద్ధాలే అసలైన యుద్ధాలకి దారితీస్తాయి. చరిత్ర ఇదే నిరూపించింది’’ అని ట్విట్టర్‌లో హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement