భూమిని చీల్చుకు వచ్చిన మొసళ్లు.. గుండె గుభేల్‌మనిపిస్తున్న వీడియో..!

crocodiles came out of the ground one by one - Sakshi

మనిషి తాను చాలా తెలివైనవాడినని అనుకుంటాడు. అయితే ఎంతటి తెలివైనవాడైనా క్రూరజంతువులకు తప్పనిసరిగా దూరంగా ఉండాల్సివస్తుంది. ఎందుకంటే అవి అత్యంత ‍ప్రమాదకరమైనవి. ఒకవేళ ఇంటికి సమీపంలో ఏదైనా క్రూర జంతువు కనిపిస్తే ప్రాణాలు పోయినంత పనవుతుంది. ఇటువంటి ఉదంతానికి సంబంధించిన  ఒక వీడియో వైరల్‌గా మారింది. 

ఈ వీడియోలో ఒక గల్లీలో భూమికి పగుళ్లు కనిపిస్తాయి. అక్కడ సగభాగం లోపలికి, మరో సగభాగం బయటకు ఉ‍న్న మొసలి కనిపిస్తుంది. అటవీశాఖ అధికారులు ఆ మెసలిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తుండటాన్ని కూడా వీడియోలో చూడవచ్చు. ఈ వీడియోలో కొంచెం ముందుకు వెళితే, భూమిని చీల్చుకువస్తున్న మరో మొసలి కూడా కనిపిస్తుంది. దానిని చూసిన అక్కడున్న జనం భయపడటాన్ని గమనించవచ్చు. ఇలా మరో మొసలి కూడా లోపలి నుంచి వస్తుందని అక్కడున్నవారెవరూ ఊహించలేరు. ఆ మొసళ్లు అక్కడున్నవారిని అమాంతం మింగేద్దామనే రీతిలో బయటకు వచ్చాయి. అయితే అక్కడున్న అధికారులు ఆ మొసళ్లను పట్టుకుని సురక్షిత ప్రాంతాల్లో వదిలివేశారు. 

ఈ వీడియో ఏప్రాంతానికి చెందినదో ఇప్పటివరకూ స్పష్టం కాలేదు. ఈ వీడియోను ట్విట్టర్‌లో @Figen అనే అకౌంట్‌లో షేర్‌ చేశారు. ఈ వీడియోకు ఇప్పటివకూ 2.2 మిలియన్ల వ్యూస్‌ దక్కగా, 26 వేలమంది వీడియోను లైక్‌ చేశారు. అలాగే పలువురు యూజన్లు కామెంట్లు కూడా చేశారు.  ‘ఈ వీడియో నమ్మశక్యంగా లేదని’ ఒక యూజర్‌ పేర్కొనగా, మరొక యూజర్‌ ‘ఇక్కడేం జరుగుతోంది’ అని రాశారు. 
ఇది కూడా చదవండి: చెత్తతో 6 చక్రాల వాహనం.. ‘మెకానికల్‌ గాడిద’ సూపర్‌ సే ఊపర్‌ అంటూ కితాబు!
 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top