2030కల్లా చంద్రుడి మీదకు చైనా వ్యోమగాములు | Sakshi
Sakshi News home page

2030కల్లా చంద్రుడి మీదకు చైనా వ్యోమగాములు

Published Tue, May 30 2023 6:04 AM

China to send astronauts to Moon by 2030 as space race - Sakshi

బీజింగ్‌: అంతరిక్ష పరిశోధనలో పశ్చిమదేశాలతో పోటీపడుతున్న చైనా మరో ముందడుగు వేస్తోంది. వచ్చే ఏడేళ్లలో చంద్రుడి మీదకు మానవసహిత ప్రయోగాలు చేపడతామని చైనా మ్యాన్డ్‌ స్పేస్‌ ఏజెన్సీ డెప్యూటీ డైరెక్టర్‌ లిన్‌ జిక్వియాంగ్‌ ప్రకటించారు.

భూమి నుంచి చంద్రుడి మీదకు వెళ్లిరావడం, స్వల్పకాలం చంద్రుడిపై ల్యాండింగ్, మానవసహిత రోబో పరిశోధనలు, ల్యాండింగ్, కలియతిరగడం, శాంపిళ్ల సేకరణ, పరిశోధన, తిరుగుప్రయాణం ఇలా పలు కీలక విభాగాల్లో పట్టుసాధించేందుకు కృషిచేస్తున్నట్లు ఆయన చెప్పారు. చందమామ దక్షిణ ధృవం వైపు గడ్డకట్టిన నీటి నిల్వల అన్వేషణ కోసం 2025కల్లా మరోమారు వ్యోమగాములను పంపాలని అమెరికా అంతరిక్ష సంస్థ నాసా ప్రకటించిన నేపథ్యంలో చైనా చంద్రుడిపై శోధనకు సిద్ధమైందని ఆ దేశ అధికార వార్తా సంస్థ జిన్హువా తెలిపింది.

Advertisement
Advertisement