చైనా స్వదేశీ విమానం సక్సెస్‌ | China first domestically built plane successfully | Sakshi
Sakshi News home page

చైనా స్వదేశీ విమానం సక్సెస్‌

May 29 2023 5:08 AM | Updated on May 29 2023 5:08 AM

China first domestically built plane successfully  - Sakshi

బీజింగ్‌: చైనా మొట్టమొదటి సారిగా పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ప్రయాణికుల విమానం సీ919 ఆదివారం విజయవంతంగా ప్రయాణించింది. విమానయాన రంగం మార్కెట్‌లోకి డ్రాగన్‌ దేశం అధికారికంగా ప్రవేశించింది.

పశ్చిమదేశాలకు చెందిన బోయింగ్, ఎయిర్‌బస్‌ సంస్థలతో పోటీ పడేలా చైనా ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే చైనా ఈస్ట్రన్‌ ఎయిర్‌లైన్స్‌ ప్రయాణికుల విమానాన్ని తయారు చేసింది. తొలిసారిగా షాంఘై నుంచి బీజింగ్‌కు వెళ్లిన ఈ విమానం రెండున్నర గంటల్లో సురక్షితంగా గమ్యస్థానానికి చేరుకున్నట్టు జిన్‌హువా న్యూస్‌ ఏజెన్సీ వెల్లడించింది.

Advertisement
 
Advertisement
Advertisement