క్రిప్టో కుంభకోణంపై మస్క్ సెటైర్లు.. బినాన్స్ సహ వ్యవస్థాపకుడు ఫైర్‌! | Changpeng Zhao fires on Elon Musk for Satires On Crypto Scam | Sakshi
Sakshi News home page

క్రిప్టో కుంభకోణంపై మస్క్ సెటైర్లు.. బినాన్స్ సహ వ్యవస్థాపకుడు ఫైర్‌!

Oct 31 2026 6:32 PM | Updated on Oct 31 2026 6:35 PM

Changpeng Zhao fires on Elon Musk for Satires On Crypto Scam

ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌పై క్రిప్టో కరెన్సీ ఎక్స్ఛేంజ్ బినాన్స్ సహ వ్యవస్థాపకుడు చాంగ్‌పెంగ్ జావో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల బినాన్స్‌పై జరిగిన రూ.లక్షల కోట్ల క్రిప్టో హ్యాక్ ఘటనపై మస్క్ సెటైర్లు వేయడాన్ని తప్పుబట్టారు. ఇలాంటి సమయంలో జోకులు చేయడం సరికాదని, బాధితులకు మద్దతుగా నిలవాలని సూచించారు.

బినాన్స్‌పై జరిగిన సైబర్ దాడిలో సుమారు 6.3 బిలియన్ డాలర్ల విలువైన క్రిప్టో ఆస్తులు చోరీకి గురైనట్లు వార్తలు వచ్చాయి. ఈ ఘటనపై మస్క్ సోషల్ మీడియా వేదిక ఎక్స్‌లో నవ్వుతున్న ఎమోజీలతో స్పందించారు. దీంతో చాంగ్‌పెంగ్ జావో అసహనం వ్యక్తం చేశారు.

‘ఎలాన్.. మీపై నాకు ఎంతో గౌరవం ఉంది. కానీ ఇలాంటి సమయంలో ఎగతాళి చేయడం సరికాదు. దయచేసి ఆపండి’ అంటూ చాంగ్‌పెంగ్ పోస్టు చేశారు. అంతేకాదు గతంలో మస్క్ ట్విటర్ కొనుగోలుకు సమయంలో బినాన్స్ 500 మిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టిన విషయాన్ని కూడా ఆయన మస్క్‌కు గుర్తుచేశారు. తమ పెట్టుబడికి ప్రతిగా తాము కొంత మద్దతు మాత్రమే ఆశిస్తున్నట్లు జావో పేర్కొన్నారు.

మరోవైపు ఈ భారీ సైబర్ దాడి వెనుక ఉత్తరకొరియాకు చెందిన ట్రేడర్ ట్రెయిటర్ హ్యాకింగ్ గ్రూప్ ఉండొచ్చని దర్యాప్తు సంస్థలు అనుమానిస్తున్నాయి. చోరీకి గురైన క్రిప్టో ఆస్తుల్లో ఇప్పటివరకు సుమారు 3 బిలియన్ డాలర్ల విలువైన వాటిని స్తంభింపజేసినట్లు సమాచారం. బాధిత వినియోగదారుల నష్టాలను పూర్తిగా భర్తీ చేస్తామని బినాన్స్ ప్రకటించింది.

ఇదీ చదవండి: క్రిప్టో ప్రపంచంలో భారీ దోపిడీ.. ఉత్తర కొరియా హ్యాకర్లపై అనుమానాలు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement