కెనడా నిజ్జర్‌ కేసు: మరో అనుమానితుడు అరెస్ట్‌ | Canada Arrests Fourth Indian National In Khalistani Terrorist Hardeep Nijjar Case, Details Inside | Sakshi
Sakshi News home page

Nijjar Case Updates: మరో అనుమానితుడు అరెస్ట్‌

May 12 2024 11:40 AM | Updated on May 12 2024 12:09 PM

Canada Fourth Arrest In Khalistani Terrorist Hardeep Nijjar Case

అట్టావా: ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్‌ సింగ్‌ నిజ్జర్‌ హత్య కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. నిజ్జర్‌ కేసులో కెనడా పోలీసులు మరో అనుమానితుడిని అరెస్టు చేశారు. దీంతో, ఈ కేసులో నాలుగో వ్యక్తి అమర్‌దీప్‌ సింగ్‌ను అరెస్ట్‌ చేసినట్టు పోలీసులు అధికారిక ప్రకటన చేశారు. 

కాగా, హర్దీప్‌ సింగ్‌ నిజ్జర్‌ కేసులో మరో అనుమానితుడు అమర్‌దీప్‌ సింగ్‌ను కెనడా పోలీసులు అరెస్ట్‌ చేశారు. బ్రాంప్టన్‌ ప్రాంతంలో ఉంటున్న అమర్‌దీప్‌ను అరెస్ట్‌ చేసినట్టు అధికారికంగా తెలిపారు. ఇక, ఈ కేసులో ఇప్పటికే ముగ్గురు అరెస్ట్‌ అయిన విషయం తెలిసిందే. కరన్‌ బ్రార్‌, కమల్‌ ప్రీత్‌ సింగ్‌, కరన్‌ ప్రీత్‌ సింగ్‌ను కెనడా పోలీసులు అరెస్టు చేశారు. భారత్‌కు చెందిన వీరు ముగ్గురు ప్రస్తుతం ఎడ్మంటన్‌ ప్రాంతంలో నివాసముంటున్నారు. 

మరోవైపు, ఈ పరిణామాల వెనక రాజకీయ ప్రయోజనాలు దాగి ఉన్నాయని భారత విదేశాంగా శాఖ కీలక వ్యాఖ్యలు చేసింది. అరెస్టు విషయంలో కెనడా కేవలం సమాచారం మాత్రమే ఇచ్చిందని తెలిపింది. అధికారికంగా ఎలాంటి సంప్రదింపులు జరపలేదని పేర్కొంది. వేర్పాటువాదులు, ఉగ్రవాదులకు కెనడా సర్కారు రాజకీయ వేదిక కల్పించిందని మరోసారి స్పష్టం చేసింది. గత ఏడాది జులై 18న బ్రిటిష్‌ కొలంబియాలోని సర్రే ప్రాంతంలో నిజ్జర్‌ హత్య జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నిజ్జర్‌ హత్య వెనుక భారత్‌ ఏజెంట్ల పాత్ర ఉందంటూ కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో చేసిన ఆరోపణలు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement