
రియో డీ జనీరో: బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా అనే ఐదు జాతీయ ఆర్థిక వ్యవస్థల భాగస్వామ్య కూటమి(బ్రిక్స్) ఇప్పుడు మరోదేశాన్ని తన భాగస్వామ్యంలో చేర్చుకుంది. తాజాగా ఇండోనేషియాను కొత్త సభ్యునిగా ‘బ్రిక్స్’ స్వాగతించింది. ఈ నేపధ్యంలో కాలానుగుణంగా బ్రిక్స్ ఎలా విస్తరించిందో ఇప్పుడు తెలుసుకుందాం.
2010లో న్యూయార్క్‌లో జరిగిన ‘బ్రిక్స్’ విదేశాంగ మంత్రుల సమావేశంలో దక్షిణాఫ్రికాను తమ కూటమిలో చేర్చుకునేందుకు అంగీకరించినట్లు ఒక ప్రకటనలో తెలిపింది. 2011లో సన్యాలో జరిగిన మూడవ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశానికి దక్షిణాఫ్రికా హాజరైంది. తాజాగా జరిగిన బ్రిక్స్ దేశాధి నేతల సమావేశంలో ఇండోనేషియాను గ్రూప్‌లో సభ్యునిగా స్వాగతించడంతో, ఇప్పుడు బెలారస్, బొలీవియా, కజకిస్తాన్, నైజీరియా, మలేషియా, థాయిలాండ్, క్యూబా, వియత్నాం, ఉగాండా, ఉజ్బెకిస్తాన్ సహా 10 దేశాలు బ్రిక్స్‌లో భాగస్వామ్య దేశాలుగా అవతరించాయి.
బ్రెజిల్‌లోని రియో డి జనీరోలో జరిగిన 17వ బ్రిక్స్ సమ్మిట్ ఉమ్మడి ప్రకటనలో ‘బ్రిక్స్ సభ్యదేశంగా ఇండోనేషియా రిపబ్లిక్‌ను, బెలారస్ రిపబ్లిక్, బొలీవియా ప్లూరినేషనల్ స్టేట్, కజకిస్తాన్ రిపబ్లిక్, క్యూబా రిపబ్లిక్, ఫెడరల్ రిపబ్లిక్ ఆఫ్ నైజీరియా, మలేషియా, థాయిలాండ్ , సోషలిస్ట్ రిపబ్లిక్ ఆఫ్ వియత్నాం, ఉగాండా రిపబ్లిక్, ఉజ్బెకిస్తాన్ రిపబ్లిక్‌లను బ్రిక్స్ భాగస్వామ్య దేశాలుగా స్వాగతిస్తున్నామని పేర్కొన్నారు. ఆదివారం జరిగిన బ్రిక్స్ సమావేశంలో బ్రిక్స్ విస్తరణలో భాగంగా కొత్త భాగస్వాములను చేర్చుకోవడం అనేది కూటమి దేశాల సామర్థ్యాన్ని పెంపొందిస్తుందని ప్రధాని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు.
BRICS welcomes Indonesia as member, and 10 partner countries, including Belarus, Malaysia
Read @ANI Story | https://t.co/amBamKwFtb#BRICS #Indonesia #Belarus #BRICS2025 #Thailand pic.twitter.com/H9vPhodQlH— ANI Digital (@ani_digital) July 7, 2025
2006లో సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో జరిగిన జీ8 సమ్మిట్‌లో రష్యా, భారత్, చైనా నేతల సమావేశం అనంతరం సమూహంగా బ్రిక్స్ ఏర్పాటయ్యింది. 2006లో న్యూయార్క్‌లో జరిగిన ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో బ్రిక్స్‌కు అధికారిక గుర్తింపు వచ్చింది. మొదటి బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం 2009లో రష్యాలో జరిగింది. 2010లో న్యూయార్క్‌లో జరిగిన బ్రిక్ విదేశాంగ మంత్రుల సమావేశంలో దక్షిణాఫ్రికాను చేర్చడంతో అది బ్రిక్స్‌గా మారింది.
ఇది కూడా చదవండి: ‘నిధుల్లేవ్.. నేనేమి మంత్రినీ కాను’.. వరద సాయంపై ఎంపీ కంగనా