
రోదసి పర్యాటకానికి ఊపు తెచ్చే దిశగా ప్రపంచ కుబేరుడు జెఫ్ బెజోస్‌కు చెందిన బ్లూ ఆరిజిన్ సంస్థ మరో ముందడుగు వేసింది. మహిళా సెలబ్రిటీలతో 10 నిమిషాల బుల్లి రోదసి యాత్రను సోమవారం విజయవంతంగా నిర్వహించింది.
బెజోస్ కాబోయే భార్య లారెన్ శాంచెజ్‌తో పాటు ప్రఖ్యాత అమెరికా గాయని కేటీ పెర్రీ, జర్నలిస్టు గేల్ కింగ్, సినీ నిర్మాత కెరియన్ ఫ్లిన్, సైంటిస్టు అమందా గుయెన్, నాసా మాజీ ఇంజనీర్ ఆయేషా బోవ్ ఇందులో భాగస్వాములయ్యారు. న్యూ షెపర్డ్ వ్యోమనౌకలో భూ ఉపరితలానికి 107 కిలోమీటర్ల ఎత్తుకు వెళ్లి కాసేపు భారరహిత స్థితిని ఆస్వాదించారు. అనంతరం పారాచూట్ల సాయంతో వ్యోమనౌక భూమికి తిరిగొచి్చంది. బ్లూ ఆరిజిన్‌కు ఇది 11వ మానవసహిత అంతరిక్ష యాత్ర.