స్వదేశానికి వస్తే ఐదేళ్ల జైలు శిక్ష..!

Australians Arriving From India Could Face 5 Years Jail - Sakshi

కాన్‌బెర్రా: భారత్‌లో కరోనా వైరస్‌ విజృంభిస్తోంది. దేశంలో రోజు లక్షలాదిగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో పలు దేశాలు భారత్‌ నుంచి వచ్చే ప్రయాణికులపై   ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. కాగా ఆస్ట్రేలియా మరో అడుగు ముందుకు వేసి మరింత కఠిన నిర్ణయం తీసుకుంది. భారత్‌లో ఉన్న ఆస్ట్రేలియా పౌరులు 14 రోజుల్లోగా తాము భారత్‌ నుంచి స్వదేశానికి వెళ్లాలని భావిస్తున్న వారిపై  ఆస్ట్రేలియా ప్రభుత్వం నిషేధం విధించింది. ఈ నిర్ణయాన్ని లెక్కచేయకుండా ప్రవేశించిన పౌరులకు ఐదు ఏళ్ల జైలు శిక్ష, భారీ జరిమానా విధించాలని ఆస్ట్రేలియా ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 3 నుంచి ఈ ఆంక్షలు అమలులోకి రానున్నాయి. ఈ తాత్కాలిక నిషేధ్ఞాలను  శుక్రవారం రోజున ఆస్ట్రేలియా ప్రభుత్వం విధించింది. తమ దేశానికి తిరిగి వచ్చే ఆస్ట్రేలియా పౌరులపై  జైలు శిక్ష విధించడం ఇదే తొలిసారి.  

ప్రస్తుతం ప్రపంచంలోనే భారత్‌ అతి పెద్ద కోవిడ్ హాట్ స్పాట్ గా మారింది. ఈ నేపథ్యంలో ఇలాంటి కఠిన నిర్ణయం తీసుకున్నామని ఆస్ట్రేలియా ఆరోగ్య శాఖ మంత్రి గ్రెగ్ హర్ట్ తెలిపారు. తాజా ఆంక్షలపై తాము ఈ నెల 15 న పునరాలోచన చేస్తామని గ్రెగ్ హర్ట్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. భారత్‌లో కరోనా కేసులు తగ్గముఖం పట్టిన తరువాత ఈ నిర్ణయాన్ని పునఃపరిశీలిస్తామన్నారు. ఈ నిర్ణయంపై పలు ఆస్ట్రేలియన్‌ పౌరులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఆస్ట్రేలియాకు చెందిన మెడికల్‌ సర్జన్‌ నీలా జానకీరామన్ దేశానికి తిరిగి వచ్చే ఆస్ట్రేలియన్‌ పౌరులకు శిక్ష విధించడం హేయమైన చర్యగా భావించారు. ఇండో- ఆస్ట్రేలియన్లు ఈ నిర్ణయాన్ని జాతి వివక్షగా పరిగణిస్తున్నామని తెలిపారు.  ఇతర దేశాల నుంచి వచ్చే వారిని, తమను వేరుగా చూస్తున్నారని ఆమె ఆస్ట్రేలియా ప్రభుత్వాన్ని విమర్శించింది. ఈ సందర్భంగా అమెరికా, యూకే, యూరప్ దేశాల్లో కూడా కోవిడ్ రోగులు లేరా అని ప్రశ్నించారు.

మరోవైపు మానవ హక్కుల బృందాలు కూడా ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుపట్టాయి. ప్రభుత్వం ఇలాంటి నిర్ణయాన్ని తీసుకునే బదులు క్వారంటైన్ పై దృష్టి పెడితే బాగుండేదని ఆస్ట్రేలియా రైట్స్ వాచ్ డైరెక్టర్ ఎలైన్ పియర్సన్ ఒక ప్రకటనలో తెలిపారు. భారత్‌ నుంచి వచ్చే ప్రయాణికులపై  ఆస్ట్రేలియా ప్రభుత్వం నిషేధం విధించడంతో సుమారు 9000 మంది ఆస్ట్రేలియా పౌరులు భారత్‌లో చిక్కుకుపోయారు.

చదవండి: ‘భారత్‌లో లాక్‌డౌన్‌ పెట్టండి..!’

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

06-05-2021
May 06, 2021, 12:30 IST
వాషింగ్టన్: ప్రస్తుతం కరోనా వైరస్‌ కారణంగా ప్రపంచ దేశాలు అల్లాడిపోతున్నాయి. ఈ మహమ్మారిని అడ్డుకట్టకు టీకాతోనే సాధ్యమని భావించి ఆయా దేశాలు ఇప్పటికే వ్యాక్సిన్ల తయారీ, ఉత్పత్తిలో...
06-05-2021
May 06, 2021, 11:43 IST
తిరువనంతపురం: కేరళలో కరోనా రెండో దశ విశ్వరూపం చూపిస్తోంది. రాష్ట్రంలో కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కోవిడ్‌ కట్టడికి కేరళ...
06-05-2021
May 06, 2021, 08:18 IST
సాక్షి, హైదరాబాద్‌: ప్రైవేటు ఆసుపత్రులు కరోనా రోగుల నుంచి లక్షలాది రూపాయలు ఫీజులుగా వసూలు చేస్తుండడంపై హైకోర్టు ఆందోళన వ్యక్తం...
06-05-2021
May 06, 2021, 08:06 IST
సాక్షి, గాంధీఆస్పత్రి( హైదరాబాద్‌): మనోధైర్యంతో కరోనా మహమ్మారిని జయించారు.. నాలుగు గోడల మధ్య ఒంటరిగా హోంక్వారంటైన్‌లో ఉంటూ పాజిటివ్‌ దృక్పథంతో...
06-05-2021
May 06, 2021, 06:06 IST
జెనీవా (స్విట్జర్లాండ్‌): ఈ ఏడాదికి వాయిదా పడ్డ యూరో కప్‌ ఫుట్‌బాల్‌ టోర్నమెంట్‌ను సాఫీగా జరిపేందుకు నడుం బిగించిన యూనియన్‌...
06-05-2021
May 06, 2021, 05:33 IST
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కరోనా విలయతాండవం కొనసాగుతోంది. మూడురోజుల పాటు కాస్త తగ్గుముఖం పట్టిన రోజువారీ కరోనా పాజిటివ్‌ కేసులు...
06-05-2021
May 06, 2021, 05:33 IST
సాక్షి, విశాఖపట్నం: దేశంలో విజృంభిస్తున్న కోవిడ్‌–19 సెకండ్‌ వేవ్‌పై జరుగుతున్న సమరంలో భారత నౌకాదళం ఓ అడుగు ముందుకేసింది. ప్రస్తుత...
06-05-2021
May 06, 2021, 05:27 IST
పుట్టపర్తి అర్బన్‌: కరోనా.. ఎక్కడ విన్నా ఇదే మాట. పట్టణాలన్నీ వైరస్‌ బారిన పడినా.. కొన్ని పల్లెలు మాత్రం భద్రంగా...
06-05-2021
May 06, 2021, 05:24 IST
సాక్షి ప్రతినిధి, చెన్నై: ఆక్సిజన్‌ కొరత ఎందరి ప్రాణాలనో బలితీసుకుంటోంది. తమిళనాడు రాష్ట్రం చెంగల్పట్టు జిల్లా ప్రభుత్వాస్పత్రి కరోనా వార్డులో...
06-05-2021
May 06, 2021, 05:18 IST
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉన్నందువల్ల దేశంలోని వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో జరగాల్సిన ఉపఎన్నికలను వాయిదా...
06-05-2021
May 06, 2021, 05:17 IST
తిరుమల: కరోనా నియంత్రణలో భాగంగా బుధవారం నుంచి రాష్ట్రంలో మధ్యాహ్నం 12 నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల...
06-05-2021
May 06, 2021, 04:33 IST
కర్నూలు (హాస్పిటల్‌): కోవిడ్‌ బాధితుల్లో కొందరు శరీరంలో ఆక్సిజన్‌ శాతం తగ్గిపోయి ప్రాణాలు కోల్పోతున్నారు. ఇలాంటి వారిని కాపాడుకునేందుకు నిమిషానికి...
06-05-2021
May 06, 2021, 02:54 IST
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మొదటి డోసు వ్యాక్సిన్‌ వేయించుకున్న వారికి సకాలంలోనే రెండో డోసు వేస్తామని వైద్య ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి...
06-05-2021
May 06, 2021, 01:52 IST
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి సెకండ్‌ వేవ్‌ కారణంగా పెద్ద సంఖ్యలో నమోదవుతున్న మరణాల నేపథ్యంలో జాతీయ స్థాయిలో...
06-05-2021
May 06, 2021, 01:05 IST
సాక్షి, హైదరాబాద్‌: ‘రాష్ట్రంలో పరిస్థితులు పూర్తి నియంత్రణలో ఉన్నాయి. లాక్‌డౌన్‌తో ఉపయోగం లేదని నమ్ముతున్నాం. కొన్ని రాష్ట్రాలు లాక్‌డౌన్‌ విధించినా...
06-05-2021
May 06, 2021, 01:05 IST
ముంబై: రెండో దశ కరోనా వ్యాప్తితో కుదేలైన ఆర్థిక వ్యవస్థను ఆదుకునేందుకు ఆర్‌బీఐ ప్రకటించిన ఉద్దీపన చర్యలు స్టాక్‌ మార్కెట్‌ను...
06-05-2021
May 06, 2021, 00:57 IST
ముంబై: కరోనా కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వర్గాలను ఆదుకునేందుకు ఆర్‌బీఐ రంగంలోకి దిగింది. వ్యక్తులు, చిన్న, మధ్య తరహా వ్యాపార...
06-05-2021
May 06, 2021, 00:40 IST
న్యూఢిల్లీ: కరోనా వల్ల అతలాకుతలం అయిన ఢిల్లీ ప్రజలకు తనవంతు సాయం అందించేందుకు భారత మాజీ క్రికెటర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌...
05-05-2021
May 05, 2021, 18:41 IST
అమరావతి: ఏపీలో కరోనా కట్టడికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. కరోనా కట్టడిలో భాగంగా ఏపీలో...
05-05-2021
May 05, 2021, 18:23 IST
ఢిల్లీ: దేశంలో కరోనా కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తోందని కేంద్ర వైద్యారోగ్యశాఖ జాయింట్‌ సెక్రటరీ లవ్‌ అగర్వాల్‌ తెలిపారు. దేశంలో కరోనా మహమ్మారి...
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top