యూకేలో 300 విమానాల రద్దు | 300 Flights Cancelled Over Issues With UK Air Traffic Control System | Sakshi
Sakshi News home page

యూకేలో 300 విమానాల రద్దు

Sep 9 2026 4:27 AM | Updated on Sep 9 2026 4:27 AM

300 Flights Cancelled Over Issues With UK Air Traffic Control System

ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌లో సాంకేతిక సమస్యే కారణం  

లండన్‌: బ్రిటన్‌లో మంగళవారం విమానాల రాకపోకలు నిలిచిపోయాయి. దాదాపు 300 విమానాలను రద్దు చేశారు. ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌కు సంబంధించి సాంకేతిక సమస్య తలెత్తడమే ఇందుకు కారణం. వందలాది విమానాలు నిలిచిపోయాయి, ఇందులో భారత్‌కు, భారత్‌ నుంచి నడిచే సుదూర ప్రాంత విమానాలు కూడా ఉన్నాయి. పలు విమానాలు రద్దయ్యాయి. మరికొన్ని ఆలస్యంగా నడిచాయి. 

లండన్‌లోని హీత్రూ, గాట్‌విక్, స్టాన్‌స్టెడ్‌ ఎయిర్‌పోర్టులతోపాటు ఈస్ట్‌ మిడ్‌లాండ్స్‌ విమానాశ్రయాల్లో కూడా టేకాఫ్, ల్యాండింగ్‌ షెడ్యూళ్ల విషయంలో ఇబ్బందులు తలెత్తాయి. దీంతో పలు విమానాలను యూరప్‌లోని ప్రత్యామ్నాయ విమానాశ్రయాలకు మళ్లించారు. దీనిపై యూకేలో విమాన రాకపోకల నియంత్రణ, గగనతల నిర్వహణ సేవలను అందించే ‘నేషనల్‌ ఎయిర్‌ ట్రాఫిక్‌ సర్వీసెస్‌’సంస్థ స్పందించింది. విమాన నిర్వహణ వ్యవస్థలో తలెత్తిన సమస్యను గుర్తించి, పరిష్కరించినట్లు తెలియజేసింది. ఈ రోజు ప్రయాణికులకు కలిగిన అంతరాయానికి క్షమాపణలు కోరుతున్నామని వెల్లడించింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement