కెనడాలో కాల్పులు | 24-year-old Indian murdered in Canada Vancouver | Sakshi
Sakshi News home page

కెనడాలో కాల్పులు

Apr 15 2024 5:25 AM | Updated on Apr 15 2024 5:25 AM

24-year-old Indian murdered in Canada Vancouver - Sakshi

భారతీయ విద్యార్థి దుర్మరణం

ఒట్టావా: విదేశాల్లో భారతీయ విద్యార్థుల మరణాల ఘటనలు ఆగట్లేవు. తాజాగా కెనడాలో గుర్తు తెలియని వ్యక్తులు జరిపిన కాల్పుల్లో 24 ఏళ్ల భారతీయ విద్యార్థి చిరాగ్‌ అంటిల్‌ ప్రాణాలు కోల్పోయారు. వాంకోవర్‌ సిటీ పరిధిలో 12వ తేన రాత్రి ఈ దుర్ఘటన జరిగింది. వాంకోవర్‌ సిటీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రెండేళ్ల క్రితం ఉన్నత చదువుల కోసం హరియాణాలోని సోనిపట్‌ నుంచి చిరాగ్‌ కెనడాకు వచ్చారు.

విద్యార్థి వీసా మీద కెనడాకు వచ్చి ఎంబీఏ చేసి ఇక్కడే తాత్కాలిక ఉద్యోగంలో చేరారు. ఏప్రిల్‌ 12వ తేదీన చిరాగ్‌ తన కారులో ఉండగా గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. తుపాకీ కాల్పుల శబ్దం విని స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చేసరికి చిరాగ్‌ తన కారులో విగతజీవిగా పడి ఉన్నారు. ఈ ఘటనలో ఇంకా ఎవరినీ అరెస్ట్‌చేయలేదు.  చిరాగ్‌ మృతదేహాన్ని భారత్‌కు తరలించేందుకు భారత సర్కార్‌ సాయపడాలంటూ చిరాగ్‌ కుటుంబం ప్రధాని మోదీ, విదేశాంగ మంత్రి జైశంకర్‌కు విజ్ఞప్తిచేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement