అమెరికాలో మళ్లీ కాల్పుల మోత

2 Dead Including Suspect In US Hospital Shooting - Sakshi

న్యూయార్క్: అమెరికాలో మళ్లీ కాల్పులు కలకలం సృష్టించాయి. న్యూ హాంప్‌షైర్‌లోని ఓ సైకియాట్రిక్ ఆస్పత్రిలో దుండగుడు కాల్పులు జరిపాడు. ఈ ఘటనల్లో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. పలువురికి బుల్లెట్ గాయాలు అయ్యాయి.

నగరంలో మానసిక రోగులకు చికిత్సనందించే ఆస్పత్రి అది. శుక్రవారం ఆస్పత్రిలోకి ఓ దుండగుడు ప్రవేశించి విచక్షణ రహితంగా కాల్పులు జరిపాడు. ఆస్పత్రి లాబీలో మొదట కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో ఓ వ్యక్తి మరణించాడు. ఆస్పత్రికి సమీపంలోనే ఉన్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. ఓ అనుమానిత వ్యక్తిని హతమార్చినట్లు తెలిపారు. 

ఈ ఘటనలో ఎంత మంది బాధితులున్నారో స్పష్టంగా తెలియదు. ప్రస్తుతం ఆస్పత్రి పోలీసుల పర్యవేక్షలో ఉంది. పరిస్థితి అదుపులోనే ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. ప్రజలకు ఎలాంటి ప్రమాదం లేదని తెలిపారు. 

ఇదీ చదవండి: Israel-Hamas war: అల్‌–షిఫాలో మృత్యుఘోష

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top