సైనికులపై విరుచుకుపడ్డ తాలిబన్లు: 16 మంది మృతి | 16 Armed Forces died in Talibans attack | Sakshi
Sakshi News home page

సైనికులపై విరుచుకుపడ్డ తాలిబన్లు: 16 మంది మృతి

Feb 5 2021 2:15 PM | Updated on Feb 5 2021 2:16 PM

16 Armed Forces died in Talibans attack - Sakshi

కాబూల్‌‌: సైనికులపై తాలిబన్లు మూకుమ్మడి దాడి చేశారు. కనిపించిన వారిని కాల్చి పడేశారు. దీంతో 16 మంది సైనికులు ప్రాణాలు కోల్పోగా మరికొందరు తీవ్ర గాయాలపాలయ్యారు. వారు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటన ఆఫ్ఘ‌నిస్థాన్‌లోని ఖాన్ అబాద్ జిల్లాలో గురువారం రాత్రి చోటుచేసుకుంది. అయితే భద్రతా బలగాలపై ప్రతీకార చర్యగా ఈ దాడి చేసినట్లు తెలుస్తోంది.

తాలిబ‌న్లు త‌పాయి అక్త‌ర్‌ ప్రాంతంలో భ‌ద్ర‌తా బ‌ల‌గాల‌ను ల‌క్ష్యం చేసుకుని కాల్పుల‌కు తెగపడ్డారు. ఇష్టమొచ్చిన రీతిలో కాల్పులు జరపడంతో దాడుల్లో 16 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. మ‌రో ఇద్ద‌రు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. వెంటనే అప్రమత్తమైన బలగాలు దాడికి పాల్పడ్డ వారిని కనిపెట్టే పనిలో పడ్డాయి. కాల్పులు జ‌రిగిన ప్రాంతానికి భ‌ద్ర‌తా బ‌ల‌గాలు చేరుకుని ప‌రిస్థితిని స‌మీక్షించాయి. తాలిబ‌న్ల ఆచూకీ కోసం బ‌ల‌గాలు గాలింపు చ‌ర్య‌లు మొద‌లుపెట్టాయి. రెండు రోజుల కిందట తాలిబన్లపై భద్రతా బలగాలు దాడి చేసి 15 మందిని ఎన్‌కౌంటర్‌ చేయగా దానికి ప్రతిచర్యగా తాలిబన్లు ఈ దాడికి తెగపడ్డారు. దీంతో 16మందిని బలి తీసుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement