ఎంఎంసీ కమిషనర్ వినయ్‌కృష్ణారెడ్డి
సాక్షి, సిటీబ్యూరో: ఎంఎంసీ పరిధిలోని పెండింగ్ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తిచేస్తామని కమిషనర్ టి.వినయ్‌కృష్ణారెడ్డి అన్నారు. మంగళవారం ఎంఎంసీ ప్రధాన కార్యాలయంలో ప్రాజెక్టుల పెండింగ్ పనులపై అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏఓసీ ప్రాజెక్టుకు సంబంధించి రక్షణ శాఖకు చెందిన భూమికి బదులు రాష్ట్ర ప్రభుత్వం నుంచి 5.78 ఎకరాల భూ కేటాయింపు, శామీర్‌పేట్‌లోని ఎల్‌ఎల్‌ఆర్ ప్రాంతంలో 153 ఎకరాల భూ బదిలీ ప్రక్రియను వేగవంతం చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. టీకేఆర్ ఫ్లై ఓవర్ నిర్మాణంలో ప్రభావితమయ్యే ఆస్తులపై సమీక్షించారు. ఆర్‌కేపురం ఆర్‌ఓబీ నిర్మాణంతో ప్రభావితమయ్యే 34 ఆస్తుల యజమానులకు త్వరలోనే టీడీఆర్‌లు జారీ చేయనున్నట్లు తెలిపారు. సమావేశానికి హాజరైన ఆస్తులు కోల్పోనున్న భవనాల యజమానులతో మాట్లాడుతూ.. టీడీఆర్‌ల జారీ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేస్తామన్నారు.


