హైదరాబాద్: అంతర్జాతీయ రెజ్లర్ సౌరవ్ గుర్జార్ (42) చేతిలో మోసపోయిన మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ (37) సంవత్సర కాలంగా నగరంలోని గచ్చిబౌలిలో నివసిస్తున్నారు. కర్ణాటకకు చెందిన ఈమెకు 2016లో వివాహం కాగా, అనంతరం భర్తకు విడాకులిచ్చింది. 2021లో అమెరికాలో చదువుకుంటుండగా సౌరవ్‌తో ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పరిచయం ఏర్పడింది. సౌరవ్‌ది మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ మహవీర్‌పుర.
మహాభారత్ సీరియల్‌లో భీముడి పాత్రతో అభిమానులను సంపాదించుకున్నాడు. పలు సినిమాల్లో నటించాడు. కాగా, తనతో పాటు కొద్ది నెలలు ఉన్న సౌరవ్ పెళ్లి పేరిట నమ్మించి లైంగిక దాడికి పాల్పడ్డాడని సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఆగస్టు 18న గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో లుక్‌ఔట్ నోటీసు జారీ చేశారు. శుక్రవారం ముంబై విమానాశ్రయం ఎగ్జిట్‌లో సౌరవ్‌ను అరెస్ట్ చేశారు. అక్కడే మెజిస్ట్రేట్ ముందు హాజరుపర్చి ట్రాన్సిట్ వారెంట్‌పై తీసుకొచ్చారు. శనివారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించామని గచ్చిబౌలి ఇన్‌స్పెక్టర్ సైదులు తెలిపారు.
ఇదీ చదవండి: ఖైరతాబాద్‌కు ఉపఎన్నిక అనివార్యమైతే ఆసక్తికరం


