హైదరాబాద్‌లో ఈగల్ ఫోర్స్ భారీ ఆపరేషన్ | International Drug Racket Busted In Hyderabad | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో ఈగల్ ఫోర్స్ భారీ ఆపరేషన్

Sep 20 2026 8:16 PM | Updated on Sep 20 2026 8:16 PM

International Drug Racket Busted In Hyderabad

సాక్షి, హైదరాబాద్: డ్రగ్స్ నెట్‌వర్క్‌పై ఈగల్ ఫోర్స్ భారీ ఆపరేషన్ చేపట్టింది. అంతర్జాతీయ డ్రగ్స్‌ రవాణా ముఠా గుట్టు రట్టయ్యింది. ​డెడ్ డ్రాప్ పద్ధతిలో డ్రగ్స్ సప్లై చేస్తూ.. వాట్సాప్, గూగుల్ మ్యాప్స్ ద్వారా విక్రయాలు జరుపుతున్నారు. ​36 గంటల పాటు ఈ ఆపరేషన్ చేపట్టిన ఈగల్‌ ఫోర్స్‌.. 31 మంది క్యారియర్లు, 230 మంది వినియోగదారులను గుర్తించింది. ​ఒడిశాకు చెందిన పలువురు కీలక ముఠా సభ్యులను ఈగల్‌ ఫోర్స్‌ అరెస్ట్ చేసింది. 

​23 మంది బాధితులకు డి-అడిక్షన్ పూర్తి కాగా.. వారిని కోర్టు ముందు హాజరుపర్చగా.. ఎన్డీపీఎస్‌ యాక్ట్ సెక్షన్ 64-A కింద పునరావాసం పొందిన వారికి న్యాయస్థానం మినహాయింపు ఇచ్చింది. ​మైనర్లకు పొగాకు ఉత్పత్తులు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని.. పాన్ షాపుల యాజమాన్యాలకు ఈగల్ ఫోర్స్ హెచ్చరికలు జారీ చేసింది.

ఇదీ చదవండి: హైదరాబాద్‌లో ఒరిగిన భవనం.. ఎలా కూల్చేశారంటే..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement