భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం వినోబానగర్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామ సర్పంచ్ గంగావత్ నవీన్ పెద్ద కుమార్తె తన్వితా శ్రీ (4) మృతి చెందింది. ఆడుకుంటూ ఇంటి ఎదుట నిలిపి ఉన్న కారులోకి వెళ్లిన ఆ చిన్నారి.. కారు డోర్లు లాక్ కావడంతో లోపలే చిక్కుకుపోయింది. దీంతో ఆ చిన్నారి ఊపిరాడక మృతి చెందింది. చిన్నారి జాడ తెలియక కుటుంబ సభ్యులు ఊరంతా వెతికారు. చివరకు కారులో చూడగా ఆ చిన్నారి కనపడింది. చిన్నారి మృతితో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.


