డీజిల్‌కు డబ్బులివ్వలేదని.. బాలికను బయటకు నెట్టేశారు  | Unconscious girl forced out of Maharashtra govt ambulance | Sakshi
Sakshi News home page

డీజిల్‌కు డబ్బులివ్వలేదని.. బాలికను బయటకు నెట్టేశారు 

Oct 15 2026 6:24 AM | Updated on Oct 15 2026 6:24 AM

Unconscious girl forced out of Maharashtra govt ambulance

ప్రభుత్వ ఆస్పత్రి అంబులెన్స్‌ సిబ్బంది రాక్షసత్వం  

బీడ్‌: ప్రభుత్వ అంబులెన్సు సిబ్బంది రాక్షసత్వం ప్రదర్శించారు. డీజిల్‌కు డబ్బులివ్వలేదనే కోపంతో అపస్మారక స్థితిలో ఉన్న బాలికను ఆస్పత్రికి తీసుకెళ్లడానికి బదులుగా బయటకు నెట్టివేశారు. దీంతో, ఆ నిరుపేద తండ్రి ఆమెను భుజాన వేసుకుని, ఆస్పత్రి బాట పట్టాడు. ప్రభుత్వ వైద్య సేవల అధ్వానస్థితికి నిదర్శనంగా మారిన ఈ ఘటన మహారాష్ట్రలోని బీడ్‌ జిల్లా డిండ్రుడ్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద గత నెల 29న చోటుచేసుకుంది. 

ఇందుకు సంబంధించిన వీడియో బయటకు రావడంతో వైద్యాధికారి నీలేశ్‌ ధాక్నేను అధికారులు విధుల నుంచి తొలగించారు. ఐదో తరగతి విద్యార్థిని మూర్ఛ రావడంతో పాఠశాలలోనే కుప్పకూలిపోయింది. ఆమెను వెంటనే డిండ్రుడ్‌ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి క్లిష్టంగా మారడంతో మెరుగైన వైద్యం కోసం మరో ఆస్పత్రికి తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు. బాలికతోపాటు ఆమె తండ్రి, కుటుంబీకులు ఆస్పత్రి అంబులెన్సులో కూర్చున్న తర్వాత డీజిల్‌కు డబ్బులివ్వాలని అందులోని సిబ్బంది డిమాండ్‌ చేశారు. తన వద్ద డబ్బులు లేదని ఆ పేద తండ్రి చెప్పడంతో వారిని కిందికి దించివేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement