● రూ. 6 లక్షల సీఎంఆర్‌ఎఫ్ చెక్కు అందించిన చిన్నారెడ్డి
లక్డీకాపూల్: మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం ఇంటికన్నె గ్రామానికి చెందిన క్యాబ్ డ్రైవర్ బానోతు శ్రీను, అంజలి దంపతుల కుమారుడు వైష్ణవ్ నందన్ ఆరోగ్యం క్షీణించడంతో గత జనవరి 7న సీఎం ప్రజావాణికి వచ్చి సమస్యను వివరించారు. 17 నెలల నందన్ శ్వాసకోస ఇబ్బందులు, నిమోనియా వంటి తీవ్ర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. ఆ చిన్నారికి మెరుగైన వైద్యం అందేలా ఆస్పత్రి వర్గాలతో మాట్లాడి అండగా నిలిచింది. ఆస్పత్రి ఖర్చుల కింద రూ.ఆరు లక్షల సీఎంఆర్‌ఎఫ్. చెక్కును సీఎం ప్రజావాణి ఇంచార్జ్ డాక్టర్ జి. చిన్నారెడ్డి మంగళవారం జరిగిన సీఎం ప్రజావాణిలో చిన్నా రి తండ్రి బానోత్ శ్రీనుకు అందజేశా రు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, సీఎం ప్రజావాణి ఇంచార్జ్ డాక్టర్ జి.చిన్నారెడ్డి, స్టేట్ నోడల్ అధికారి దివ్య దేవరాజన్‌కు చిన్నారి తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. కాగా, ప్రజాభవన్ లోని 234వ సీఎం ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 408 దరఖాస్తులు అందాయి.


