మైలార్‌దేవ్‌పల్లి: నిషేధిత జర్ధా తయారు చేస్తున్న గోదాంపై మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు మంగళవారం దాడి చేశారు. ఒకరిని అరెస్ట్ చేయగా, మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. ఇన్‌స్పెక్టర్ సత్యనారాయణ తెలిపిన వివరాలు... బేగంబజార్‌కు చెందిన సయ్యద్ జమీల్, జిత్తూ మిశ్రా కాటేదాన్ గణేష్‌నగర్ ప్రాంతంలో జర్ధా, తంబాకు తయారీ గోదాం ఏర్పాటు చేశారు. సూపర్‌వైజర్‌గా శివరాంపల్లి ప్రాంతానికి చెందిన తనూరామ్(36) పని చేస్తున్నాడు. విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు మంగళవారం దాడి చేసి తనూరామ్‌ను అదుపులోకి తీసుకున్నారు. చిన్న, చిన్న ప్యాకెట్లలో జర్ధా నింపి నగరంలోని వివిధ పాన్‌షాప్‌లకు అమ్ముతున్నట్లు గుర్తించారు. వారి వద్ద నుంచి 20 కిలోల తంబాకు, అనార్ పేరు మీద పేపర్ రోల్స్, 110 డ్రమ్ముల్లో తంబాకు, తంబాకు తయారు చేసే రెండు మిషన్లను స్వాధీనం చేసుకున్నారు. కేసు దర్యాప్తులో ఉంది.


