గన్‌ఫౌండ్రీ: తెలంగాణ రాష్ట్ర భాషా, సాంస్కృతిక శాఖ, ఒడిశా, ఏపీ సాంస్కృతిక శాఖల సౌజన్యంతో కళాకృతి నృత్యాలయ ఆధ్వర్యంలో జూలై 25, 26 తేదీల్లో యాదాద్రి జాతీయ నృత్యోత్సవాలను రవీంద్రభారతిలో నిర్వహిస్తున్నట్లు సంస్థ చైర్మన్ విక్రమ్ కుమార్, డైరెక్టర్ భారతి తెలిపారు. మంగళవారం రవీంద్రభారతిలో నృత్యోత్సవాల వాల్‌పోస్టర్‌ను మంత్రి జూపల్లి కృష్ణారావు ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ కళలు, కళారూపాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని పేర్కొన్నారు. పద్మశ్రీ పురస్కార గ్రహీత గీతచంద్రన్‌కు యాదాద్రి జాతీయ ఎక్సలెన్సీ అవార్డును అందజేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.


