● ఉద్యోగుల పదవీ విరమణ సభలో కర్ణన్
సాక్షి,సిటీబ్యూరో: సాధించిన విజయాల స్ఫూర్తితో పదవీవిరమణ పొందాక కూడా ఉద్యోగులు వివిధ హోదాల్లో సామాజిక సేవ కొనసాగించాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్‌వీ కర్ణన్ సూచించారు. జీహెచ్‌ఎంసీలో ఇంజినీరింగ్, రెవెన్యూ, శానిటేషన్, యూబీడీ, టౌన్‌ప్లానింగ్, పరిపాలన విభాగాలకు చెందిన 35 మంది అధికారులు, ఉద్యోగులు మంగళవారం పదవీ విరమణ పొందారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కమిషనర్ మాట్లాడుతూ అంకితభావంతో జీహెచ్‌ఎంసీలో విశిష్ట సేవలందించారంటూ వారిని అభినందించారు. శాలువా, పుష్పగుచ్ఛాలతో సత్కరించారు.


