● యువకుడు ఆత్మహత్య
బాలానగర్: మద్యంమత్తులో భార్య, అత్తతో గొడవ పడిన ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. బాలానగర్ సీఐ నర్సింహరాజు వివరాల ప్రకారం... హరిజన బస్తీకి చెందిన టేక్మాల్ల శ్రీకాంత్(28) ప్రైవేట్ ఉద్యోగి. భర్య యామిని, నాలుగేళ్ల కుమారుడితో కలిసి ఉంటున్నాడు. మద్యానికి బానిసై తరచూ భార్య, కుటుంబ సభ్యులతో గొడవ పడేవాడు. ఈ క్రమంలో సోమవారం రాత్రి మద్యం మత్తులో ఇంటికి వచ్చి భార్య, అత్తతో మరోసారి వాగ్వాదానికి దిగాడు. మద్యం తాగి వచ్చి గొడవ చేయొద్దని అత్త మందలించడంతో వివాదం మరింత పెరిగింది. ఆ రాత్రి పక్కింటిలో నిద్రించిన భార్య, అత్త మంగళవారం తెల్లవారుజామున ఇంటికి వెళ్లి చూడగా శ్రీకాంత్ ఫ్యాన్‌కు ఉరేసుకుని కనిపించాడు. వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కేసు దర్యాప్తులో ఉంది.


