రెడ్డి కార్పొరేషన్‌కు నిధులు కేటాయించాలి | - | Sakshi
Sakshi News home page

రెడ్డి కార్పొరేషన్‌కు నిధులు కేటాయించాలి

May 17 2026 11:29 AM | Updated on May 17 2026 11:29 AM

రెడ్డి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గోపు జైపాల్‌ రెడ్డి

సాక్షి, సిటీబ్యూరో: రెడ్డి సామాజిక వర్గ్గ కార్పొరేషన్‌కు పాలక మండలి ఏర్పాటు చేసి, నిధులు కేటాయించాలని రెడ్డి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గోపు జైపాల్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. రాష్ట్ర రెడ్డి సంఘాల ప్రతినిధులతో కలిసి శనివారం రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్‌రెడ్డి, ముఖ్యమంత్రి సలహాదారు జైపాల్‌రెడ్డికి వినతి పత్రం ఇచ్చారు. అనేక పోరాటాల ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వం రెడ్డి సామాజిక వర్గ పేదల సంక్షేమానికి రెడ్డి కార్పొరేషన్‌ ఏర్పాటు చేసిందని.. అయితే నేటికీ పాలక మండలి ఏర్పాటు చేయలేదని.. నిధులు కేటాయించలేదని వివరించారు. వివిధ సామాజిక వర్గాలతో పాటు రెడ్డి కార్పొరేషన్‌కు చట్టబద్ధత కల్పించి, రూ.2 వేల కోట్ల నిధులు కేటాయించాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement