హెల్మెట్‌ లేకపోవడంతో తలకు తీవ్ర గాయాలు | - | Sakshi
Sakshi News home page

హెల్మెట్‌ లేకపోవడంతో తలకు తీవ్ర గాయాలు

May 17 2026 11:29 AM | Updated on May 17 2026 11:29 AM

బైక్‌ అదుపుతప్పి సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ మృతి

గచ్చిబౌలి: స్నేహితుడిని బస్‌స్టాప్‌లో దించి వస్తుండగా బైక్‌ అదుపుతప్పి ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ మృతి చెందాడు. గచ్చిబౌలి పోలీసులు తెలిపిన మేరు.. జార్ఖండ్‌కు చెందిన దిబ్యం కుమార్‌ (26) కొండాపూర్‌లోని సాయి అర్బన్‌ విల్లాలో నివాసముంటున్నాడు. శుక్రవారం రాత్రి స్నేహితుడు సంకల్ప్‌ సృజన్‌ను కొండాపూర్‌లోని రత్నదీప్‌ సూపర్‌మార్కెట్‌ సమీపంలో బస్‌స్టాప్‌లో దించి తిరిగి వస్తున్నాడు. బొటానికల్‌ గార్డెన్‌ ప్రధానం ద్వారం వద్ద బైక్‌ అదుపుతప్పి పడిపోవడంతో దిబ్య కుమార్‌ తలకు తీవ్ర గాయాలయ్యాయి.వెనుక బైక్‌పై వచ్చిన స్నేహితులు దిబ్య కుమార్‌ను హైటెక్‌సిటీలోని యశోద హస్పిటల్‌కు తరలించారు. చికిత్స పొందుతూ కొద్ది సేపటికే మృతి చెందినట్లు వైద్యులు పేర్కొన్నారు. దిబ్య కుమార్‌ హెల్మెట్‌ లేకపోవడంతో తలకు తీవ్ర గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement