● రూ. 3 లక్షల మద్యం సీజ్
చందానగర్ : నకిలీ విదేశీ మద్యం విక్రయిస్తున్న ఇద్దరిని కొండాపూర్ ఎకై ్సజ్ అండ్ ప్రొహిబిషన్ అధికారులు గురువారం అరెస్ట్ చేశారు. రంగారెడ్డి అసిస్టెంట్ కమిషనర్ ఆర్.కిషన్ విలేకరుల మాట్లాడుతూ.. లిక్కర్ ఈవెంట్స్‌లో ఒరిస్సాకు చెందిన లాలు ప్రసాద్ బిస్వాల్, రాజేశ్వర్ మెహర్‌లు పని చేస్తుంటారు. కరీంనగర్‌కు చెందిన శరత్ చంద్ర సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తూ అత్తాపూర్‌లో నివాసముంటున్నాడు. లాలు ప్రసాద్ బిస్వాల్, రాజేశ్వర్ మెహర్‌లను పరిచయం చేసుకొని ఖరీదైన లిక్కర్ బాటిళ్ళలో చీప్ లిక్కర్ నింపి కొండాపూర్ ప్రాంతంలోని గుట్టల బేగంపేట్‌లో తక్కువ ధరకు విక్రయిస్తున్నాడు. ఈ సమాచారం అందడంతో రంగారెడ్డి ఎన్‌ఫోర్స్‌మెంట్ సీఐ సుభాష్ చంద్ర, ఎస్‌ఐ అఖిల్, సిబ్బందితో కలిసి ఇద్దరిని అదుపులోకి తీసుకొని నకిలీ విదేశీ మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ.3 లక్షలు ఉంటుందన్నారు.


