సంపన్న కుటుంబాల పిల్లలకు డ్రగ్స్‌ సరఫరా | - | Sakshi
Sakshi News home page

సంపన్న కుటుంబాల పిల్లలకు డ్రగ్స్‌ సరఫరా

May 15 2026 12:25 PM | Updated on May 15 2026 12:25 PM

ఇద్దరు అరెస్ట్‌.. రూ. 2.58 లక్షల డ్రగ్స్‌ పట్టివేత

కుత్బుల్లాపూర్‌: సంపన్న కుటుంబాల పిల్లలకు డ్రగ్స్‌ సరఫరా చేస్తున్న ఇద్దరిని ఎకై ్సజ్‌ స్పెషల్‌ టాస్క్‌ ఫోర్స్‌ బ్రాంచ్‌ (ఎస్‌టీఎఫ్‌బీ) టీమ్‌ అరెస్ట్‌ చేసింది. కొంపల్లి హై టెన్షన్‌ రోడ్డులో డ్రగ్స్‌ అమ్మకాలు జరుపుతున్నారని సమాచారం మేరకు ఎస్‌టిఎఫ్‌బీ టీం ఎస్‌ఐలు బాలరాజు, సంధ్యతో పాటు సిబ్బంది తనిఖీలు చేపట్టారు. ఇన్నోవా కారును గుర్తించి ఆపి తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో కారులో ఉన్న ప్రవీణ్‌ వద్ద బెంగళూరు నుంచి తీసుకువచ్చిన 3.24 గ్రాముల ఎండిఎంఏ డ్రగ్‌, ఎలిజర్‌ అలియాస్‌ సన్నీ వద్ద 36.90 ఓజి కుష్‌, 7.73 గ్రాముల చెరస్‌ ను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు పట్టుకున్న డ్రగ్స్‌ విలువ రూ. 2.58 లక్షలు ఉంటుందని అంచనా వేశారు. నిందితులను కుత్బుల్లాపూర్‌ ఎకై ్సజ్‌ స్టేషన్‌లో అప్పగించినట్లు ఎస్‌టిఎఫ్‌బి టీం లీడర్‌ ప్రదీప్‌ రావు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement