ప్రధాని మోదీ సూచనలు పాటించాలి: ఎంపీ ఈటల | - | Sakshi
Sakshi News home page

ప్రధాని మోదీ సూచనలు పాటించాలి: ఎంపీ ఈటల

May 12 2026 6:18 AM | Updated on May 12 2026 6:18 AM

కంటోన్మెంట్‌: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆలోచనా ధోరణికి అనుగుణంగా ప్రజలు నడుచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఎంపీ ఈటల రాజేందర్‌ అన్నారు. పరేడ్‌ గ్రౌండ్‌లో బీజేపీ సభ విజయవంతం అయిన నేపథ్యంలో ఆయన సోమవారం కంటోన్మెంట్‌ బోర్డు సభ్యురాలు భానుక నర్మదతో కలిసి విలేకరులతో మాట్లాడారు. దేశ ఆర్థిక పరిస్థితిపై పూర్తి అవగాహన కలిగిన ప్రధాన మంత్రి ప్రజలకు పలు సూచనలు చేశారని అన్నారు. ముఖ్యంగా విదేశీ మారక నిల్వలను కాపాడుకోవాలన్నారు. ఈ నేపథ్యంలోనే బంగారం కొనుగోళ్లు తగ్గించాలని, పెట్రో ఉత్పత్తుల వినియోగాన్ని తగ్గించాలన్నారు. మేక్‌ ఇన్‌ ఇండియా.. మేడ్‌ ఇన్‌ ఇండియా కోసం మోడీ ప్రయత్నిస్తున్నారని అన్నారు. రేవంత్‌ రెడ్డిని తమతో కలవాలంటూ మోదీ పిలుపునివ్వడాన్ని తప్పుగా అర్థం చేసుకోవద్దని ఈటల అన్నారు. ఈ పిలుపుతో బీజేపీలో నాయకత్వ లేమి ఉందని చెప్పడం సరికాదన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement