నా మరదలినే ప్రేమిస్తావా..! | - | Sakshi
Sakshi News home page

నా మరదలినే ప్రేమిస్తావా..!

May 12 2026 6:18 AM | Updated on May 12 2026 6:18 AM

నా మరదలినే ప్రేమిస్తావా..!

పెళ్లి చేసుకుందామనుకున్నా..
యువకుడి హత్యకేసులో 10 మంది అరెస్ట్‌

అంబర్‌పేట: చిలకలగూడలో యువకుడి హత్య కేసును పోలీసులు ఛేదించారు. ప్రేమ వ్యవహారమే హత్యకు కారణమని తేలచ్చారు. సోమవారం అంబర్‌పేటలో డీసీపీ రక్షిత కె మూర్తి వివరాలు వెల్లడించారు. నామలగుండుకు చెందిన యవన్‌(21) చిలకలగూడకు చెందిన యువతి పాఠశాల స్థాయి నుంచే ప్రేమించుకుంటున్నారు. ఇటీవల జవహార్‌నగర్‌లో డబుల్‌బెడ్‌రూం కేటాయించడంతో అక్కడికి కుటుంబాన్ని మార్చారు. అయితే యవన్‌ సోదరి కుటుంబం నామలగుండు ప్రాంతంలో ఉండడంతో వస్తూ పాత స్నేహితులతో పాటు యువతితో సైతం సంప్రదిస్తున్నాడు. యువతి బావ అల్లాబోయిన సాయికిరణ్‌ సైతం వరసకు యువతి మరదలు కావడంతో పెళ్లి చేసుకుందమని భావించాడు. అప్పటికే సాయికిరణ్‌ చిలకలగూడ పోలీసు స్టేషన్‌ పరిధిలో రౌడిషీటర్‌. దీంతో ప్రేమ వ్యవహారానికి అడ్డుకట్ట వేయాలని నిర్ణయించి కుటుంబ సభ్యులతో చర్చించారు. యవన్‌ను హత్య చేయడమే పరిష్కారమని భావించి పథకం వేశారు. ఈ నెల 7న స్నేహితుడు సుబ్బు ఇంటికి యవన్‌ వచ్చినట్లు తెలుసుకున్నారు. యవన్‌ను బయటకు పిలిచి దాడి చేశారు. పెళ్లి చేసుకుందామనుకుంటున్న నా మరదలిని ప్రేమిస్తావా అంటూ కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశారు. పోలీసులు విచారణ జరిపి యవన్‌ హత్యకు కారణమైన యువతి బావ అల్లబోయిన సాకిరణ్‌(27), తండ్రి రాజం నర్సింహాయాదవ్‌, బాబాయ్‌లు రాజం శ్రీశైలం యాదవ్‌(48), రాజం మల్లేశ్‌యాదవ్‌(48), సోదరులు రాజం పరేమేశ్‌ యాదవ్‌(19, రాజం వంశీకృష్ణ(19, రాజం మనీష్‌(21), వీరి స్నేహితులు సిరిగిరి రాహుల్‌(22), కుచ్చుల శివనందన్‌యాదవ్‌(20)తో పాటు మరో మైనర్‌ బాలున్ని అరెస్టు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement