ఎండల్లో డిమాండ్‌ | - | Sakshi
Sakshi News home page

ఎండల్లో డిమాండ్‌

May 8 2026 11:14 AM | Updated on May 8 2026 11:14 AM

భారీగా పెరిగిన బీర్‌ల విక్రయాలు

సాక్షి, సిటీబ్యూరో: మద్యం ప్రియులు చిల్డ్‌ బీర్‌తో ‘చీర్స్‌’ కొట్టేస్తున్నారు. వేసవి తాపం నుంచి ఉపశమనం కోసం బార్‌లకు పోటెత్తుతున్నారు. అనూహ్యంగా పెరిగిన డిమాండ్‌ దృష్ట్యా ఎకై ్సజ్‌ అధికారులు బీర్‌ అమ్మకాలపై రేషన్‌ విధించడం గమనార్హం. గ్రేటర్‌లోని హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లోనే అమ్మకాలు అత్యధికంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా జరిగే విక్రయాల్లో 45 శాతానికి పైగా హైదరాబాద్‌ చుట్టుపక్కల జిల్లాల్లోనే ఉన్నట్లు పేర్కొన్నారు. ప్రతి రోజు సుమారు 3 లక్షల కేస్‌ల బీర్‌ల అమ్మకాలు జరుగుతున్నట్లు అధికారులు చెప్పారు. ఎకై ్సజ్‌ శాఖ లెక్కల ప్రకారం గత సంవత్సరం ఏప్రిల్‌లో 46.46 లక్షల కేస్‌ల బీర్‌లు విక్రయిచంగా.. ఈ ఏడాది ఏప్రిల్‌ నెలలో 56.21 లక్షల కేస్‌ల బీర్‌ల అమ్మకాలు జరిగాయి. సుమారు 20 శాతానికి పైగా వినియోగం పెరిగింది. మరోవైపు ఆదాయం కూడా అదేస్థాయిలో పెరిగింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement