పారిశుద్ధ్య కార్మికులతో కమిషనర్‌ అల్పాహారం | - | Sakshi
Sakshi News home page

పారిశుద్ధ్య కార్మికులతో కమిషనర్‌ అల్పాహారం

May 8 2026 11:14 AM | Updated on May 8 2026 11:14 AM

శ్రీనగర్‌కాలనీ: నగరాన్ని స్వచ్ఛంగా ఉంచేలా కృషి చేస్తున్న పారిశుద్ధ్య కార్మికుల సంక్షేమానికి పాటుపడతామని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆర్‌వీ కర్ణన్‌ అన్నారు. గురువారం యూసుఫ్‌గూడ సర్కిల్‌ కార్యాలయాన్ని సందర్శించారు. అనంతరం పారిశుద్ధ్య కార్మికులతో కలిసి అల్పాహారం తీసుకున్నారు. స్వచ్ఛ భారత్‌ మిషన్‌లో, జనగణన–స్వీయ గణనలో పాల్గొని విలువైన అభిప్రాయాలను అందించాలని స్థానిక నివాసితులను, జయప్రకాష్‌నగర్‌ వెల్పేర్‌ అసోసియేషన్‌ ప్రతినిధులకు తెలిపారు. జూబ్లీహిల్స్‌ నియోజకవర్గంలో నాలా సమస్యల పట్ల ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని, వేసవిలోపు పరిష్కరిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో సర్కిల్‌ డీఎంసీ సురేష్‌, డీవైఈఈ శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement