రేపటి నుంచి యువ నాటకోత్సవాలు | - | Sakshi
Sakshi News home page

రేపటి నుంచి యువ నాటకోత్సవాలు

May 5 2026 6:50 AM | Updated on May 5 2026 6:50 AM

గన్‌ఫౌండ్రీ: నాటక రంగం వైపు యువతను ప్రోత్సహించేందుకు బుధవారం నుంచి మూడు రోజుల పాటు రవీంద్రభారతిలో యువ నాటకోత్సవాలు నిర్వహించనున్నట్లు తెలంగాణ రాష్ట్ర సంగీత నాటక అకాడమీ చైర్‌పర్సన్‌ డాక్టర్‌ అలేఖ్య పుంజాల తెలిపారు. సోమవారం రవీంద్రభారతిలోని అకాడమీ కార్యాలయంలో యువ నాటకోత్సవాల బ్రోచర్‌ను ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఈ నెల 6న డింభక రాజ్యం వీధి, సిరిసిరి మువ్వ కల్చరల్‌ సంస్థ కళాకారులు గేమ్‌ సామాజిక నాటకం, నవ క్రాంతి కల్చరల్‌ అసోసియేషన్‌ కళాకారులు శ్రీ మహిషాసుర మర్దిని పద్య నాటకాలను ప్రదర్శిస్తారని వెల్లడించారు. 7న నిషాహి నిషి వీధి నాటకం, స్వప్నం రాల్చిన అమృతం, స్వామియే శరణం అయ్యప్ప పద్య నాటకాలను ప్రదర్శిస్తారని తెలిపారు. 8న మాయాజాలం డాట్‌ కామ్‌, అమ్మ చెక్కిన బొమ్మ, యయాతి అనే పద్య నాటక ప్రదర్శనలు ఉంటాయని వివరించారు. మూడు రోజుల పాటు సాయంత్రం వేళల్లో ప్రదర్శించనున్న నాటకోత్సవాలను విజయవంతం చేయాలని ఆమె కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement