వృక్షాలకు నివాళులర్పించి.. | - | Sakshi
Sakshi News home page

వృక్షాలకు నివాళులర్పించి..

May 5 2026 6:50 AM | Updated on May 5 2026 6:50 AM

ఆక్సిజన్‌ మాస్కులు ధరించి..

బంజారాహిల్స్‌: బంజారాహిల్స్‌లోని కేబీఆర్‌ పార్కు చుట్టూ కొనసాగుతున్న ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌ల నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ పర్యావరణవేత్తలు, వాకర్లు రోజుకో రీతిన వినూత్న నిరసన వ్యక్తం చేస్తున్నారు. కేబీఆర్‌ పార్కు చుట్టూ సుమారు 1,320 వృక్షాలు కొట్టేస్తుండటంతో పచ్చదనం పూర్తిగా కరువవుతోందని, భవిష్యత్తులో ఆక్సిజన్‌ అందక ప్రత్యక్ష నరకాన్ని చవిచూస్తామంటూ సోమవారం ఆక్సిజన్‌ మాస్క్‌లు ధరించి నిరసనకు దిగారు. నేలకొరిగిన వృక్షాలకు సంఘీభావంగా క్యాండిల్‌ ర్యాలీ నిర్వహించి నివాళులర్పించారు. పార్కు చుట్టూ వాక్‌వేలో ప్లకార్డులు ప్రదర్శించారు.

పర్యావరణవేత్తల వినూత్న నిరసన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement