ఒకపూట చిరుధాన్యాల ఆహారంతో ఆరోగ్యం | - | Sakshi
Sakshi News home page

ఒకపూట చిరుధాన్యాల ఆహారంతో ఆరోగ్యం

May 5 2026 6:50 AM | Updated on May 5 2026 6:50 AM

రాజేంద్రనగర్‌: రోజూ ఒక పూట చిరుధాన్యాల ఆహారం తీసుకోవడం ద్వారా ఆరోగ్యంగా జీవించవచ్చని ప్రముఖ సినీ హీరో అక్కినేని నాగార్జున అన్నారు. ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మిల్లెట్స్‌ రీసెర్చ్‌ (ఐఐఎంఆర్‌), న్యూట్రీ హబ్‌ సహకారంతో మిల్లెట్‌ మార్వెల్స్‌ ఆధ్వర్యంలో సోమవారం రాజేంద్రనగర్‌ ఐఐఎంఆర్‌లో ‘‘రోజుకు ఒక పూట చిరు ధాన్యాల భోజనం’’ జాతీయ మిషన్‌కు వర్చువల్‌గా హాజరై మాట్లాడారు. ఈ కార్యక్రమం విజయవంతం కావాలని ఆకాంక్షించారు. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి మాట్లాడుతూ తాను చిరుధాన్యాల అహారం తీసుకోవడం ద్వారా మధుమేహాన్ని తగ్గించుకోగలిగానన్నారు. ఐఐఎంఆర్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ సి.తారా సత్యవతి మాట్లాడుతూ, జీవితంలో సంతోషంగా ఉండాలంటే ఒక పూట చిరుధాన్యాల ఆహారం తీసుకోవడం మంచిదన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement