బాలల భవిష్యత్తుకు భరోసా ఇవ్వాలి | - | Sakshi
Sakshi News home page

బాలల భవిష్యత్తుకు భరోసా ఇవ్వాలి

May 5 2026 6:50 AM | Updated on May 5 2026 6:50 AM

మణికొండ: బాలలంతా చదువుకుని ఉన్నత శిఖరాలకు చేరుకునే భరోసా ఇవ్వాలని సైబరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌ జి.సృజన, పోలీస్‌ కమిషనర్‌ ఎం.రమేష్‌లు అన్నారు. నార్సింగిలోని రాజపుష్ప లేబర్‌ క్యాంప్‌లో వలస కార్మికుల పిల్లల కొరకు వర్క్‌ సైట్‌ స్కూల్‌ను వారు ప్రారంభించారు. నాణ్యమైన విద్యతో వారికి మెరుగైన భవిష్యత్తు లభిస్తుందని, ఇది దేశంలోనే మొదటి పాఠశాల అన్నారు. రాష్ట్ర అభివృద్ధిలో వలస కార్మికుల శ్రమ ఎంతో ఉందని, వారి పిల్లల భవిష్యత్తుకు మనం భరోసా ఇవ్వాల్సిన బాధ్యత ఉందన్నారు. జిల్లా విద్యాధికారి సుశీందర్‌రావు, రాజపుష్ప ఫౌండేషన్‌ ప్రతినిధి పుష్పలీల తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement