జీఓ నెం.7 రద్దు చేయాలి | - | Sakshi
Sakshi News home page

జీఓ నెం.7 రద్దు చేయాలి

May 5 2026 6:50 AM | Updated on May 5 2026 6:50 AM

జీఓ నెం.7 రద్దు చేయాలి

మాజీ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌

నాంపల్లి: జీఓ నెం.7ను తక్షణమే రద్దు చేయాలని మాజీ మంత్రి వి.శ్రీనివాస్‌ గౌడ్‌ డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం తప్పుడు జిఓను తీసుకువచ్చి విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతోందని మండిపడ్డారు. స్పష్టత లేని జిఓను వెంటనే రద్దు చేయకపోతే మరో ఉద్యమం తప్పదని హెచ్చరించారు. పెండింగ్‌లో ఉన్న ఫీజు బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరుతూ సోమవారం రాత్రి గన్‌పార్కు ఎదుట విద్యార్థులు కాగడాల ప్రదర్శన చేపట్టారు. విద్యార్థి జేఏసీ చైర్మన్‌ వేముల రామకృష్ణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన మాజీ మంత్రి వి.శ్రీనివాస్‌ గౌడ్‌ మాట్లాడారు. కొట్లాడి సాధించుకున్న తెలంగాణ ఆగమైపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. మాకు తెలంగాణ వస్తే మంచి చదువులు వస్తాయని, మా బతుకులు ఎంతో బాగుపడుతాయని ఆశిస్తే విద్యార్థులకు చదువులే లేకుండా చేస్తున్నారని దుయ్యబట్టారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఫీజు రీయంబర్స్‌మెంట్‌ బకాయిలు చెల్లించకుండా తాత్సరం చేస్తోందని ధ్వజమెత్తారు. కార్యక్రమంలో బీసీ జేఏసీ వర్కింగ్‌ చైర్మన్‌ గుజ్జ కృష్ణ, నరసింహా నాయక్‌, విద్యార్థి నేతలు సానియా, అంకిత, వైష్ణవి, సాయి, అర్చన, రమ్య, అశ్విని, కీర్తి, అక్షయ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement