ఉత్సాహంగా బాల సమ్మేళనం | - | Sakshi
Sakshi News home page

ఉత్సాహంగా బాల సమ్మేళనం

May 5 2026 6:50 AM | Updated on May 5 2026 6:50 AM

సుల్తాన్‌బజార్‌: బాల సాహిత్యానికి ఉజ్వల భవిష్యత్తు ఉందని వక్తలు అన్నారు. సోమవారం సాయంత్రం బొగ్గులకుంటలోని తెలంగాణ సారస్వత పరిషత్‌ ఆడిటోరియంలో బాల సాహిత్య సమ్మేళనం ఘనంగా జరిగింది. ఏపీ, తెలంగాణతోపాటు తమిళనాడు నుంచి బాల సాహితీ వేత్తలు, బాల సాహిత్య వికాసం కోసం ఉత్తమ అభిరుచితో కృషి చేస్తున్న ఉపాధ్యాయులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వక్తలు పాల్గొని బాల సాహిత్యాన్నికి ఉన్నత భవిష్యత్తు కల్పించే వివిధ అంశాలపై చర్చలు సాగించారు. పరిషత్‌ అధ్యక్షులు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి అధ్యక్షతన శాంత వసంత ట్రస్ట్‌ సౌజన్యంతో సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు సాగిన సమ్మేళనంలో పద్మభూషణ్‌ డాక్టర్‌ కేఐ వరప్రసాద రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురికి బాల సాహిత్య మిత్ర, బాల సాహితీమూర్తి పురస్కారాలను ప్రధానం చేశారు. ప్రభుత్వ మాజీ సలహాదారు రమణాచారి తదితరులు పాల్గొన్నారు.

వివిధ జిల్లాల నుంచి హాజరైన బాల సాహితీవేత్తలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement